Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Apr 2024 13:04 IST

1. మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా

తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వంద మంది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, కానిస్టేబుళ్లు వచ్చారన్నారు. పూర్తి కథనం

2. అమిత్ షాకు సొంత కారు లేదట..

గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhi Nagar) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, భాజపా నేత అమిత్ షా (Amit Shah) శుక్రవారం నామినేషన్‌ (Nomination) దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.పూర్తి కథనం

3. కాంగ్రెస్‌ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టరేట్‌లో ఆర్వోకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఆమె వెంట వివేకా కుమార్తె సునీత ఉన్నారు. అంతకుముందు ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ వద్ద షర్మిల నివాళి అర్పించారు.పూర్తి కథనం

4. నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలు

జైల్లో ఉన్న పాకిస్థాన్‌ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత ఆహారం తిన్న వెంటనే ఆమె కడుపునొప్పితో బాధపడుతున్నారని, ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు.పూర్తి కథనం

5. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వర్షం

నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌, తుర్కయాంజల్‌,  కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, మెహదీపట్నం, మాసబ్‌ ట్యాంక్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.పూర్తి కథనం

6. ప్రార్థనా స్థలాలు, శ్మశానాలనూ వైకాపా వదల్లేదు: నారా భువనేశ్వరి

ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలనూ వైకాపా వదల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ‘‘80 శాతం వక్ఫ్‌ భూములను వైకాపా ఆక్రమించుకుంది. భూములు కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంది. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలేవీ జగన్‌ నెరవేర్చలేదు.పూర్తి కథనం

7. భారత్‌లో ఎలాన్‌ మస్క్‌ పర్యటన వాయిదా

టెస్లా చీఫ్ ఎలాన్‌మస్క్ (Elon Musk) భారత్ పర్యటన వాయిదా పడింది. విద్యుత్‌ కార్ల తయారీ సంస్థకు చెందిన అతి ముఖ్యమైన బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యమవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.పూర్తి కథనం

8. అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్‌ను హేళన చేసిన ఇరాన్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌ (Iran)లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్‌ (Israel) ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పగా.. టెల్‌ అవీవ్‌, టెహ్రాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

9. చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా

ఏకనా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై లఖ్‌నవూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఇరు జట్ల సారథులకూ జరిమానా పడటం గమనార్హం. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా కేఎల్ రాహుల్ (KL Rahul), రుతురాజ్‌ గైక్వాడ్‌కు (Ruturaj Gaikwad) ఫైన్‌ విధించినట్లు ఐపీఎల్‌ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది.పూర్తి కథనం

10. దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

విజయవాడ నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు