icon icon icon
icon icon icon

Amit Shah: అమిత్ షాకు సొంత కారు లేదట..

Amit Shah: దాదాపు మూడు దశాబ్దాలుగా ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న అమిత్ షాకు సొంత కారు లేదట. ఈ విషయాన్ని ఆయన తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

Published : 20 Apr 2024 11:25 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhi Nagar) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, భాజపా నేత అమిత్ షా (Amit Shah) శుక్రవారం నామినేషన్‌ (Nomination) దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు.

నామినేషన్‌ వివరాల ప్రకారం.. అమిత్ షాకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కేంద్రమంత్రికి రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలున్నాయి. అమిత్ షా పేరు మీద రూ.15.77లక్షల రుణం, సోనాల్‌ పేరు మీద రూ. 26.32లక్షల రుణం ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు: రిజర్వేషన్ల జోలికి వెళ్లం: అమిత్‌ షా

2022-23లో కేంద్రమంత్రి వార్షికాదాయం రూ.75.09లక్షలుగా ఉండగా.. ఆయన సతీమణి రూ.39.54లక్షలు ఆర్జించారు. ఎంపీగా అందుకునే వేతనంతో పాటు భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల నుంచి తనకు ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. వృత్తిరీత్యా తాను రైతునని, సామాజిక కార్యకర్తనని వెల్లడించారు. తనపై మూడు క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారు.

గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండో సారి అమిత్ షా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన దాదాపు 5.57లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కేంద్రమంత్రికి పోటీగా కాంగ్రెస్‌ తమ పార్టీ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు సోనాల్‌ పటేల్‌ను రంగంలోకి దించింది. ఈ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img