icon icon icon
icon icon icon

Nara Bhuvaneswari: ప్రార్థనా స్థలాలు, శ్మశానాలనూ వైకాపా వదల్లేదు: నారా భువనేశ్వరి

ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలను వైకాపా వదల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు.

Updated : 20 Apr 2024 12:37 IST

కుప్పం: ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలనూ వైకాపా వదల్లేదని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పంలో ముస్లిం మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ‘‘80 శాతం వక్ఫ్‌ భూములను వైకాపా ఆక్రమించుకుంది. భూములు కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకుంది. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలేవీ జగన్‌ నెరవేర్చలేదు. సచివాలయంతో పాటు అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బు లాగుతున్నారు. 

తెదేపా కార్యకర్తలను బెదిరించారు.. చాలా మందిని వేధించారు. అవినీతిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు. ఉచిత విద్యుత్‌ పథకంలో భాగంగా మైనారిటీలకు 50 నుంచి 100 యూనిట్లకు పెంచింది తెదేపానే. విభజన తర్వాత ఏపీ అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఐదేళ్లు కష్టపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి రాత్రింబవళ్లు కృషి చేశారు. మహిళలకు భద్రత కల్పించే ప్రభుత్వం మాకు కావాలి’’ అని నారా భువనేశ్వరి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img