Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Mar 2024 13:08 IST

1. ఎన్నికల ప్రచారానికి అడ్డుతగిలిన మహిళలు.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ

వైకాపా ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన ఆయన్ను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ 45 రోజుల నుంచి దీక్షలు చేస్తే.. ఈరోజు ఓట్ల కోసం గుర్తుకువచ్చామా అంటూ మహిళలు నిలదీశారు. పూర్తి కథనం

2. పోలీసు అధికారిపై కేజ్రీవాల్‌ ఆరోపణలు..!

దిల్లీ పోలీసు అధికారి ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆరోపించారు. గతంలో తమనేత మనీశ్‌ సిసోదియా(Manish Sisodia)ను బలవంతంగా లాక్కెళ్లింది కూడా ఆయనేనని వెల్లడించారు. రౌజ్‌అవెన్యూ కోర్టులో సమర్పించిన అప్లికేషన్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. పూర్తి కథనం

3. రెవెన్యూ అధికారులు మోసం చేశారని.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సుబ్బారావు(47) చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం ఆయన భార్య పద్మావతి(41), కుమార్తె వినయ(17) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.పూర్తి కథనం

4. క్యాన్సర్ నిర్ధరణ.. పిల్లలకు కేట్‌ ఏం చెప్పారంటే..?

బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ కేట్‌ మిడిల్టన్(Kate Middleton) క్యాన్సర్‌(Cancer) బారినపడ్డారు. ఆమె తన ముగ్గురు పిల్లలకు ఆ విషయాన్ని ఎలా వెల్లడించారో  చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశం ద్వారా స్పందించారు. కేట్‌ (Kate Middleton) శస్త్రచికిత్స చేయించుకున్నారని జనవరిలో ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం వెల్లడించింది. పూర్తి కథనం

5. ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లో అనిల్‌ సోదరి అఖిల నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.పూర్తి కథనం

6. మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ సోదాలు

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు శనివారం సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.పూర్తి కథనం

7. మాస్కోలో ఉగ్రదాడి ఘటన.. నెలక్రితమే హెచ్చరించిన అమెరికా

రష్యా (Russia) రాజధాని మాస్కో (Moscow)లో జరిగిన భీకర ఉగ్రదాడి (Terror Attack)తో యావత్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి ముష్కరులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది. అయితే, ఈ ఘటనపై అగ్రరాజ్యం అమెరికా (USA).. గతంలోనే రష్యాను హెచ్చరించడం గమనార్హం.పూర్తి కథనం

8. డిజీ లాకర్‌తో ఆధార్‌, పాన్‌ వంటి పత్రాలు ఎప్పుడూ మీ వెంటే.. ఎలా దాచుకోవాలి?

వాహనం నడుపుతూ రోడ్డు మీద వెళ్లాలంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే పాన్‌కార్డ్‌ తప్పనిసరి. ఇక టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకొని ప్రయాణం కొనసాగించాలన్నా ఆధార్‌కార్డు లాంటి ఏదైనా గుర్తింపుకార్డు తప్పనిసరిగా చూపించాలి. ప్రభుత్వం జారీ చేసిన ఈ గుర్తింపు కార్డులు మనకు నిత్యం అవసరం అవుతూనే ఉంటాయి.పూర్తి కథనం

9. బాబూ కెమెరామెన్.. రుతురాజ్‌ కెప్టెన్‌.. అతడిని కాస్త చూపించు: వీరేంద్ర సెహ్వాగ్‌

రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కెప్టెన్‌గా తొలి విజయం నమోదు చేశాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరుతో మ్యాచ్‌కు ఒక్కరోజు ముందు ధోనీ నుంచి చెన్నై జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాలను నడిపించడంలో అద్భుత నాయకత్వం ప్రదర్శించాడు.పూర్తి కథనం

10. నెగెటివ్‌ పబ్లిసిటీ.. నియంత్రించడం మన చేతుల్లో ఉండదు: శ్రేయస్ అయ్యర్

శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer).. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. గాయం కాకుండానే ఆటకు దూరంగా ఉండిపోయాడనే ప్రచారం అతడిపై పడింది. ఎన్‌సీఏ వైద్య బృందం శ్రేయస్‌ ఫిట్‌గా ఉన్నాడని ధ్రువీకరించింది. విమర్శల మధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయస్‌ కీలకమైన 95 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని