Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Apr 2024 13:06 IST

1. నా నామినేషన్‌ అడ్డుకోవాలని వైకాపా చూస్తోంది: దస్తగిరి

పులివెందులలో తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాల దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ఈరోజే నామినేషన్‌ వేస్తున్నారని.. ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పూర్తి కథనం

2. తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Results) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 60.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది.పూర్తి కథనం

3. సుప్రీం సీరియస్‌.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు

ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద (patanjali case) సంస్థ వ్యవస్థాపకులు రాందేవ్‌ బాబా (Ramdev Baba), ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ బుధవారం మరోసారి వార్తా పత్రికల్లో బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. వీరు ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వడం రెండు రోజుల్లో ఇది రెండోసారి.పూర్తి కథనం

4. పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా

వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేసిన సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు.పూర్తి కథనం

5. ‘సంపద స్వాధీనం’పై శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్‌

సార్వత్రిక ఎన్నికల వేళ.. భాజపా (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా (Sam Pitroda) చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ మరణించిన వ్యక్తి ఆస్తిలోని 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తిరిగి పంపిణీ చేయాలని సూచించారు.పూర్తి కథనం

6. అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్‌

నవంబరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా (USA)లో ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన ప్రచార సభలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ (Joe Biden) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వాదిస్తున్నారని ఆరోపించారు.పూర్తి కథనం

7. భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారత పర్యటన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆయన రాక, దేశంలో ఆ కంపెనీ పెట్టుబడులు దాదాపు ఖాయమనే అనుకున్నారంతా. షోరూమ్‌ల కోసం స్థలాలు కూడా అన్వేషిస్తున్నారని వార్తలు రావటంతో త్వరలో మన రోడ్లపై టెస్లా (Tesla) కార్లు పరుగెడతాయనుకున్నారు.పూర్తి కథనం

8. మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్‌ టిప్స్‌

ప్రముఖులు, వ్యాపారవేత్తల దినచర్య గురించి ప్రతిఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. వారు తమ రోజులను ఎలా ప్రారంభిస్తారు? ఎలాంటి ఆహారం తీసుకుంటారు? అనే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఎదురుచూస్తుంటారు. తాజాగా యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు వేదాంత అధిపతి అనిల్‌ అగర్వాల్‌ (Anil Agarwal).పూర్తి కథనం

9. 14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్‌

చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై లఖ్‌నవూ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 210/4 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లఖ్‌నవూ గెలిచింది. సగానికిపైగా మ్యాచ్‌లో పైచేయి సాధించినా.. చివర్లో తమ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం మంచు ప్రభావమని చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ (Ruturaj Gaikwad) అన్నాడు.పూర్తి కథనం

10. లోక్‌సభ ఎన్నికలు.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. 30న అందోల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభకు ప్రధాని హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని