icon icon icon
icon icon icon

PM Modi: లోక్‌సభ ఎన్నికలు.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు

ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.

Updated : 24 Apr 2024 19:19 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి. 30న అందోల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సభకు ప్రధాని హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. మే 3న వరంగల్‌ లోక్‌సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదేరోజు భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసే సభలకు హాజరవుతారు. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని పాల్గొంటారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img