icon icon icon
icon icon icon

Dastagiri: నా నామినేషన్‌ అడ్డుకోవాలని వైకాపా చూస్తోంది: దస్తగిరి

పులివెందులలో తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి విమర్శించారు.

Updated : 24 Apr 2024 11:53 IST

కడప: పులివెందులలో తన నామినేషన్‌ను అడ్డుకోవాలని వైకాపా చూస్తోందని వివేకా హత్య కేసులో అప్రూవర్‌, జై భీమ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తన నామపత్రాల దాఖలు కార్యక్రమాన్ని నేటి నుంచి గురువారానికి మార్చుకున్నట్లు చెప్పారు. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి ఈరోజే నామినేషన్‌ వేస్తున్నారని.. ఆ పార్టీ ర్యాలీలోకి వైకాపా కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనపై రాళ్ల దాడికి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం అందిందన్నారు. సీఎం జగన్‌ నామినేషన్‌ వేసినప్పుడే తానూ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పులివెందులలో తనను జగన్‌, అవినాష్‌ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని.. దీటుగా ఎదుర్కొంటానని దస్తగిరి తెలిపారు.

దస్తగిరికి భద్రత పెంపు..

నామినేషన్‌ నేపథ్యంలో దస్తగిరికి భద్రత పెంచారు. గురువారం ఆయన నామపత్రాలను ఆర్వోకు సమర్పించనున్నారు. దీంతో ఆయనకు బుధ, గురువారాల్లో భద్రత పెంచారు. 3+3, 4+4 నుంచి 4+4, 10+10కు భద్రత పెంచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img