Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Apr 2024 13:04 IST

1. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్‌?: సీఎంకు వివేకా సతీమణి లేఖ

సీఎం జగన్‌ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. పూర్తి కథనం

2. విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌.. అమెరికాలో కొత్త నిబంధనలు

విమానాల రద్దు, మార్గం మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే రిఫండ్‌ ఇచ్చేలా అమెరికా (USA) ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు రుసుముల బాదుడు నుంచి కస్టమర్లను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్‌ (Joe Biden) కార్యవర్గం బుధవారం తెలిపింది.పూర్తి కథనం

3. హైదరాబాద్‌, బెంగళూరు మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగించారు. అర్ధరాత్రి 12.15 గంటలకు చివరిగా రైళ్లు బయలుదేరనున్నాయి. 1.10 గంటలకు ఇవి గమ్యస్థానాలకు చేరుకోనున్నాయి.పూర్తి కథనం

4. ఐపీఎల్‌ స్ట్రీమింగ్‌ కేసు.. నటి తమన్నాకు సమన్లు

ప్రముఖ నటి తమన్నా (Tamannaah)కు మహారాష్ట్ర సైబర్‌ పోలీసు (Maharashtra Cyber Cell) విభాగం సమన్లు జారీ చేసింది. ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా ‘ఫెయిర్‌ ప్లే’ యాప్‌లో ప్రదర్శించిన కేసులో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చింది. ఈ నెల 29న సైబర్‌ విభాగం ఎదుట విచారణకు హాజరుకావాలని సూచించింది.పూర్తి కథనం

5. దేశాల మధ్య డీప్‌ఫేక్‌ చిచ్చు.. ఫిలిప్పీన్స్‌-చైనాలో కలకలం సృష్టించిన వీడియో

ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ (DeepFake) కలకలం సృష్టిస్తోంది. చైనా (China)పై దాడి చేయాలంటూ స్వయంగా దేశాధ్యక్షుడే ఆదేశాలు జారీచేసినట్లున్న వీడియో క్లిప్ ఫిలిప్పీన్స్‌ (Philippines)లో సంచలనం కలిగిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. ఒక వీడియోలో ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్ తన సైన్యానికి సూచనలు చేస్తున్నట్టుగా ఉంది.పూర్తి కథనం

6. రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్‌ ఫ్రీ కంటెంట్‌, 4K వీడియో క్వాలిటీ

వీడియో స్ట్రీమింగ్‌ రంగంపై పట్టు సాధించేందుకు జియో సినిమా క్రమంగా సిద్ధమవుతోంది. తాజాగా అందుబాటు ధరలో రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. పాత ప్లాన్లలోని అధిక ధర, వీడియోలో నాణ్యతలేమి, డివైజ్‌ల సంఖ్య వంటి పరిమితులను తాజాగా అధిగమించింది.పూర్తి కథనం

7. తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటీ

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)తో భాజపా (BJP) జాతీయ నేతలు సమావేశమయ్యారు. గురువారం ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. పూర్తి కథనం

8. నామినేషన్లకు ముందు.. అయోధ్యకు రాహుల్‌, ప్రియాంక గాంధీ?

ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ కుటుంబసభ్యులే ఈ స్థానాల నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీ చేస్తున్న వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాత యూపీ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, ఈ మధ్యలో రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అయోధ్య (Ayodhya) సందర్శనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.పూర్తి కథనం

9. హైదరాబాద్‌కు ‘ఉప్పల్‌’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?

287.. 266.. ఇవి గత మూడు మ్యాచుల్లో రెండుసార్లు హైదరాబాద్‌ చేసిన స్కోర్లు. ఇప్పుడు మరోసారి ఇలాంటి పరుగుల సునామీ రాబోతోందా? ఐపీఎల్‌ అభిమానులు ఆశపడుతున్న 300+ నమోదు కాబోతోందా? ఈరోజు జరగబోయే బెంగళూరు మ్యాచ్‌లో ఆ గణంకాలను చూస్తామా?పూర్తి కథనం

10. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం.. నిందితులపై సైబర్‌ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేసింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఐటీ యాక్ట్‌ 66(ఎఫ్‌)ను పోలీసులు ప్రయోగించనున్నారు. దీనిపై పోలీసులు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని