ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 May 2024 13:01 IST

1. నా పారితోషికం విషయంలో చాలా జోకులేశారు

నాకౌట్ దశలో తన బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టమని మరోసారి కోల్‌కతా పేసర్ మిచెల్ స్టార్క్‌ నిరూపించాడు. తొలి క్వాలిఫయర్‌లో 3, ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 2 వికెట్లు తీసి తన సత్తా ఏంటో చూపించాడు. మినీ వేలంలో రూ. 24.75 కోట్లు వెచ్చించడంపై అప్పట్లో కేకేఆర్‌పై జోకులు పేలాయి. అందుకు తగ్గట్టుగానే లీగ్‌ స్టేజ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. పూర్తి కథనం

2.పాపువా న్యూగినీలో 2,000కు చేరిన మృతుల సంఖ్య

పాపువా న్యూగినీ(Papua New Guinea)లో కొండచరియలు విరిగి పడిన  ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ‘‘కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారు’’ అని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. పూర్తి కథనం

3.జగన్‌, ఆయన బంధువుల అండతో జవహర్‌రెడ్డి భూ కుంభకోణం: బొండా ఉమా

ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. పూర్తి కథనం

4. ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ...వీడియో వైరల్‌

న్యూయార్క్‌ (New York)లో ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (replica of the Statue of Liberty) వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇలా ఆశ్చర్యపోవడానికి కారణం ఆ విగ్రహం భారత్‌లో ఉండటమే. పంజాబ్‌ (Punjab)లోని తరణ్‌ తారణ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నమూనాను నిర్మిస్తున్న వీడియో సోషల్‌ మీడియా (social media) లో వైరల్‌గా మారింది. పూర్తి కథనం

5. రఫాలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. 35 మంది మృతి

గాజాలోని రఫాలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడుల్లో దాదాపు 35 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలిపింది. మృతులు, గాయపడిన వారిని తీసుకెళ్లేందుకు రఫాలో సరిపడా సామర్థ్యం ఉన్న ఆసుపత్రులేమీ లేవని పేర్కొంది. పూర్తి కథనం

6. మరో వారం రోజులు బెయిల్‌ పొడిగించండి..సుప్రీంకు కేజ్రీవాల్‌ వినతి

ఎన్నికల ప్రచారం నేపథ్యంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను మరో ఏడు రోజులు పొడిగించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సుప్రీం (Supreme court)లో పిటిషన్‌ వేశారు. ఇటీవల ఆయన తీవ్ర ఆరోగ్య సమస్యలను పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ మంజూరు చేయమని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరడంతో జూన్‌ 1వరకు సుప్రీం కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పూర్తి కథనం

7. వేములవాడ రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం వేములవాడకు భక్తులు పోటెత్తారు. శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం సోమవారం వేకువజాము నుంచే భారీగా తరలివచ్చారు. తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది భక్తులు చేరుకున్నారు. రాజన్న దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. పూర్తి కథనం

8. సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. కొరియర్ల పేరిట డబ్బులు మాయం!

నేరాలందు సైబర్ నేరాలు వేరయా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్ల వ్యవహారం. రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ.. బాధితుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఫిషింగ్, అపరిచిత లింక్‌లు, ఆధార్ స్కామ్‌లు, ఫెడెక్స్ కొరియర్లంటు నమ్మించి నిలువున ముంచుతున్నారు. పూర్తి కథనం

9. అప్పటి నుంచే తిరుమలకు..

శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తరచు తిరుమల వెళ్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడకు వెళ్లడానికి గల కారణాన్ని తెలిపారు. పూర్తి కథనం

10. ఒకే క్యాంపస్‌లో రెండు యూనివర్సిటీలా..?

 సీఎం జగన్ తన తండ్రి పేరుతో సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని