Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 May 2024 13:14 IST

1. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) హైదరాబాద్‌ చేరుకున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. పూర్తి కథనం

2. ఇండియా Vs చైనా సైన్యం.. ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో విజయం మనదే

భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో (India Vs China Tug Of War) భారత జవాన్లు విజయం సాధించారు.పూర్తి కథనం

3. సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ

చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం ఏసీబీ కోర్టు విచారించింది.పూర్తి కథనం

4. 1962లో భారత్‌పై చైనా దాడి ‘ఆరోపణలేనట’.. మణిశంకర్‌ అయ్యర్‌ మరో దుమారం

సార్వత్రిక ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్‌ (Congress)కు తలనొప్పిగా మారాయి. మొన్నటికి మొన్న పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని, ఆ దేశాన్ని గౌరవించాలంటూ ఆ పార్టీ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ (Mani Shankar Aiyar) చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.పూర్తి కథనం

5. తెలంగాణలో ప్రభుత్వం ఉన్నటా? లేనట్టా?: కేటీఆర్‌

తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా? అని నిలదీశారు.పూర్తి కథనం

6. ఇది యుద్ధం కాదు.. మారణహోమం: కాల్పుల విరమణకు గళమెత్తిన ఇండియన్‌ సెలబ్రిటీలు

రఫా(Rafah) నగరంలోని ఒక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలు, మహిళలు సహా 45 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దృశ్యాలు ప్రతిఒక్కరినీ కలిచివేస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్ వేదికగా ఈ దాడిని ఖండిస్తున్నారు. పూర్తి కథనం

7. ఆ దృశ్యాలు చూస్తే గుండె తరుక్కుపోతోంది.. ఇజ్రాయెల్‌పై అగ్రరాజ్యం ఆగ్రహం!

రఫాలో ఇజ్రాయెల్‌ (Israel) ఆదివారం జరిపిన దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దాడి దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయని పేర్కొంది.పూర్తి కథనం

8. చైనా సైన్యం చేతిలో రోబో భౌ భౌ.. కంబోడియాలో ప్రదర్శించిన డ్రాగన్‌

చైనా (China) సైన్యం ఆధునికీకరణ అత్యంత వేగంగా జరుగుతోంది. తాజాగా అభివృద్ధి చేసిన రోబో డాగ్స్‌ను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో మరోసారి ప్రదర్శించింది. ఈ మరశునకంపై ఓ ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు.పూర్తి కథనం

9. పేటీఎంలో అదానీ వాటాల కొనుగోలు? అప్పర్‌ సర్క్యూట్‌కు స్టాక్‌

ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం (Paytm) షేరు విలువ బుధవారం అనూహ్యంగా పుంజుకుంది. ఆరంభంలోనే ఐదు శాతం పెరిగి రూ.359.45 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది. పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌లో దేశీయ బడా వ్యాపార సంస్థ అదానీ గ్రూప్‌ (Adani Group) వాటాలు కొనుగోలు చేయనుందన్న వార్తలే స్టాక్‌ ర్యాలీకి దోహదం చేశాయి.పూర్తి కథనం

10. బెయిల్‌ పొడిగింపు అభ్యర్థన.. కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

తన మధ్యంతర బెయిల్‌ అంశంలో ఆమ్‌ఆద్మీపార్టీ(AAP) అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ఊరట లభించలేదు.  బెయిల్‌ను మరో ఏడురోజుల పాటు పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్‌ను కోర్టు విచారించే అవకాశం లేదు. ఆ పిటిషన్‌ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు