Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 Mar 2024 08:59 IST

1. జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులు

రాష్ట్ర ప్రజలకు వచ్చే జులై నుంచి హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులను అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌ ఆర్టీసీ కళాభవన్‌లో మంథని వైదిక సంస్థ ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్‌బాబుకు ఆదివారం సత్కార సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రజలు గర్వించేలా పనిచేస్తామన్నారు. పూర్తి కథనం

2. ఇక వేలంలో కొనడమే!

తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గుశాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది.పూర్తి కథనం

3. షాక్‌ల మీద షాక్‌లు.. వల్లభనేని వంశీకి ‘సొంత’ వర్గం ఝలక్‌

గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సొంత పార్టీలో సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి పనిచేసేది లేదని తెగేసి చెప్పేశారు. ఆయన వర్గీయుల్లో చాలా మంది ఇప్పటికే తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వాన్ని బలపరుస్తూ తెదేపాలో చేరిపోయారు. పూర్తి కథనం

4. నేడు భాజపా గూటికి గాలి జనార్దనరెడ్డి

కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దనరెడ్డి సోమవారం భాజపాలో చేరనున్నారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. తన పార్టీని భాజపాలో విలీనం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో ఒకసారి ఆయన భేటీ అయ్యారు.పూర్తి కథనం

5. అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వ కుయుక్తి

వైకాపాతో అంటకాగుతున్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కడప డీఎస్పీ షరీఫ్‌ మరోసారి ఆ పార్టీకి నిస్సిగ్గుగా వత్తాసు పలికారు. అధికారపార్టీ అరాచకాన్ని కప్పిపుచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికుడు సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ వైకాపా నాయకుల భూదాహం వల్ల బలవన్మరణానికి పాల్పడగా.. డీఎస్పీ షరీఫ్‌ ఆ విషయాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. పూర్తి కథనం

6. రూ.91,325 కోట్లు ఏమయ్యాయి?

వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మార్చిందని జనసేన పీఏపీ ఛైర్మన్‌, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం భాజపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి కథనం

7. నాలుగేళ్లుగా మోత.. వెళ్లిపోతూ వాత!

నగరాలు, పట్టణాల్లో 2020-21 వరకు అమలులో ఉన్న అద్దె ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని రద్దు చేసిన జగన్‌ ప్రభుత్వం... 2021-22 నుంచి ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా ఆస్తిపన్ను విపరీతంగా పెరిగింది. ఆ మొత్తాన్ని ఒకేసారి విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో దాన్ని... చేరుకునేంత వరకు ఏటా 15% చొప్పున భారం మోపడం మొదలు పెట్టింది.పూర్తి కథనం

8. ట్యాపింగ్‌ వెనక ప్రముఖులు!

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులున్నట్లు పోలీసులు గుర్తించారు. పలుమార్లు ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రణీత్‌రావు బృందం ఈ వ్యవహారం నడిపినట్లు వెల్లడైంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు ప్రజాప్రతినిధులూ దీని వెనక ఉన్నట్లు దర్యాప్తు అధికారులకు సమాచారం లభించింది.  పూర్తి కథనం

9. 272 సీట్లు ఇండియా కూటమివే

లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి 272 సీట్లు సాధించి భాజపాను గద్దె దించుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ధీమా వ్యక్తంచేశారు. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ఒంటరిగానే పోటీ చేస్తున్నా, కూటమి నుంచి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వైదొలిగినా ఎన్నికల్లో పెద్దగా ప్రభావం ఉండదని ఆదివారం పీటీఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పూర్తి కథనం

10. గురుకులాలకు సొంత భవనాలు

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు సొంత భవనాలు సమకూర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10-15 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. తొలి విడతలో భూములు గుర్తించిన.. ఇప్పటికే స్థలాలు స్వాధీనం చేసిన గురుకులాలకు భవనాలు నిర్మించనుంది. ఇలాంటి గురుకులాలు ఎన్ని ఉన్నాయి? ఏడాదిలోగా ఎన్ని భవనాలు పూర్తవుతాయి?పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని