Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 01 May 2023 16:59 IST

1. తుని రైలు దహనం కేసు కొట్టివేత.. విజయవాడ రైల్వే కోర్టు తీర్పు

తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వాదనలు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానం స్పందిస్తూ.. దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు!

తెలంగాణలో రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉచిత సిలిండర్లు.. ‘నందిని’ పాలు : కర్ణాటక ప్రజలకు భాజపా హామీల వర్షం

అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)కు సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక (Karnataka) రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా అధికార భాజపా (BJP) అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో (election manifesto)ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10లక్షల ఉద్యోగాలు, పేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని కాషాయ పార్టీ హామీలు కురిపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అదానీ వ్యవహారంపై దర్యాప్తు... 6నెలల గడువంటే అనుమానమే..!

అదానీ సంస్థలపై (Adani Group) వచ్చిన ఆరోపణలపై జరుపుతోన్న దర్యాప్తు గడువు పెంచాలంటూ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (SEBI) కోరడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. దర్యాప్తును సీరియస్‌గా చేయడం లేదని, దానిని మూసివేసేందుకే గడువు పెంచుతున్నారనే భావన కలుగుతుందని పేర్కొంది. దర్యాప్తు గడువును పెంచాలని కోరుతూ సుప్రీం కోర్టును సెబీ ఆశ్రయించినట్లు వచ్చిన వార్తలపై కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టోర్నీ సగం ముగిసినా.. ఇంకా వీరి ఆట మొదలవలేదు!

అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అన్న చందంగా ఐపీఎల్‌లో (IPL) కొందరి ఆటతీరు మారింది. తమపై ఫ్రాంచైజీలు ఉంచిన నమ్మకాలను నిలబెట్టుకోలేకపోతున్నారు. అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. కుర్రాళ్లు జోరుగా పరుగులు రాబడుతుంటే.. భారీగా ఆశలు పెట్టుకున్న కొందరు క్రికెటర్లు మాత్రం దారుణంగా విఫలమై జట్టుకు భారంగా మారామా..? అన్నట్లుగా తయారయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘అది మా స్టోరీ కాదు’.. సినిమా వివాదంపై థరూర్ స్పందన

కేరళనాట ‘ది కేరళ స్టోరీ’ వివాదం నడుస్తోంది. ఇది మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ఓ సినిమా. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. థాయ్‌లాండ్‌లో 83 మంది భారత గ్యాంబ్లర్ల అరెస్టు

థాయ్‌లాండ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న గ్యాంబ్లింగ్‌ను అక్కడి స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. పటాయాలోని ఓ లగ్జరీ హోటల్‌లో 93 మంది గ్యాంబ్లర్లను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా ఓ కథనంలో వెల్లడించింది. ఇందులో 83 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. బాంగ్‌ లామంగ్‌ జిల్లాలోని ఆసియా పటాయా హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున జరిపిన తనిఖీల్లో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాతో దోస్తీ నష్టమే.. పాక్‌ మంత్రుల సంభాషణ లీక్‌..!

అమెరికా(USA) నిఘా నేత్రం పాకిస్థాన్‌(Pakistan)పై ఏ స్థాయిలో ఉందో తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌( Shehbaz Sharif), విదేశాంగశాఖ జూనియర్‌ మంత్రి హీనా రబ్బానీ (Hina Rabbani )మధ్య జరిగిన సంభాషణలను అమెరికా ఇంటెలిజెన్స్‌ వర్గాలు సేకరించాయి. దీనికి సంబంధించిన పత్రాలు.. డిస్కార్డ్‌ మెసేజింగ్‌ యాప్‌లో బహిర్గతం అయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘విడాకుల’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విడాకుల (Divorce) మంజూరు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని