AP High Court: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను సస్పెండ్‌ చేసింది.

Published : 01 May 2023 14:38 IST

అమరావతి: ఏపీ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. అసోసియేషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.

ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ సర్వీసు అసోసియేషన్‌, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. నిరసనలకు దిగితే ప్రభుత్వం నోటీసులు ఇస్తోందని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో జీతాలకు సంబంధించి గవర్నర్‌ను కలవడంపైనా ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ నోటీసును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని