Weather Report: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated : 01 May 2023 18:04 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక రాష్ట్రాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్‌లోనూ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని