Vijayawada: తుని రైలు దహనం కేసు కొట్టివేత.. విజయవాడ రైల్వే కోర్టు తీర్పు

తుని వద్ద రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది.

Updated : 01 May 2023 16:57 IST

విజయవాడ: తుని రైలు దహనం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. 24 మంది సాక్షుల్లో 20 మందిని విచారించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రైలు దహనం ఘటనలో ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. వాదనలు పూర్తి అయిన తర్వాత న్యాయస్థానం స్పందిస్తూ.. దర్యాప్తు ప్రక్రియలో, నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను రైల్వే పోలీసులు కోర్టు ముందు ఉంచలేకపోయారని పేర్కొంది. ఈ నేపథ్యంలో ముగ్గురు రైల్వే అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. అనంతరం కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

కాపు రిజర్వేషన్‌ సాధన కోసం 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌  దహనమైంది. అప్పట్లో 41 మందిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు విభాగం, గవర్నమెంట్‌ రైల్వే పోలీసులు (జీఆర్పీ) నమోదు చేసిన పలు కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఆర్పీఎఫ్‌ కేసు పెండింగ్‌లో ఉంది. రైల్వే చట్టంలోని సెక్షన్లు 146, 147, 153, 174 (ఎ), (సి) కింద అప్పట్లో కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన రైల్వే కోర్టు తాజాగా కేసును కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని