Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 28 Feb 2024 13:00 IST

1. నా తల్లిని అవమానపరుస్తారా?: బండి సంజయ్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం

భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ (Ponnam prabhakar) అన్నారు. రాజకీయాలతో ఆమెకు ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పూర్తి కథనం

2. Magunta: వైకాపాకు మరో షాక్‌.. ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా

వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్తి కథనం

3. Suryapet: ఆటో-బస్సు ఢీ.. నలుగురి మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. పూర్తి కథనం

4. TDP: ఆర్టీసీ బస్సులకు తెదేపా నేతల దరఖాస్తు.. తిరస్కరించిన అధికారులు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా బుధవారం తెదేపా-జనసేన తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభకు బస్సులు కేటాయించాలని ఆర్టీసీని తెదేపా నాయకులు కోరారు. 100 బస్సులు కావాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, 50 బస్సుల కోసం ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దరఖాస్తు చేశారు. పూర్తి కథనం

5. USA: టెక్సాస్‌ను కమ్ముకొన్న కార్చిచ్చు.. 60 కౌంటీల్లో విపత్తుగా ప్రకటన..!

అమెరికా (USA)లోని టెక్సాస్‌ (Texas) రాష్ట్రం దావాగ్నుల్లో చిక్కుకొంది. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ కార్చిచ్చులకు ఎండిపోయిన గడ్డి, గాలి తోడు కావడంతో చూస్తుండగానే రెండింతలయ్యాయి. వీటిల్లో పెద్దదాన్ని స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రభుత్వం చాలా చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేయిస్తోంది. పూర్తి కథనం

6. Rajiv Gandhi: రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి మృతి..

మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ (Rajiv Gandhi) హత్య కేసులో జీవిత ఖైదును అనుభవించిన దోషుల్లో ఒకడైన శాంతన్‌ (Santhan)(55) మృతి చెందాడు. అనారోగ్యంతో తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి కథనం

7. Shopping Tips: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి!

పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఈ వేడుకలకు కొనుగోళ్లు ఎక్కువే ఉంటాయి. వివాహాలు జరిపే కుటుంబాలే కాకుండా హాజరయ్యేవారూ షాపింగ్‌ చేయడం పరిపాటి. సీజన్‌ సమీపిస్తున్న కొద్దీ ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయి. చాలా మంది అత్యుత్తమ డీల్స్‌ను పొందేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం అవసరం. దాని కోసమే ఇవిగో కొన్ని చిట్కాలు.. పూర్తి కథనం

8. Himachal Pradesh: క్రాస్‌ఓటింగ్‌ ఎఫెక్ట్‌.. హిమాచల్‌ సీఎంపై ‘అవిశ్వాస’ అస్త్రం..!

Hరాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం నెలకొంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో అధికార కాంగ్రెస్‌ (Congress)కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ.. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీకి ఓటేయ్యడంతో హస్తం పార్టీ అభ్యర్థి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పూర్తి కథనం

9. Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్‌ తేజ్‌ అలా.. ‘టిల్లు’ ఇలా!

ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చిలో ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించి, వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. నేరుగా ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ మూవీస్‌ ఏవి? ఏయే రోజుల్లో రానున్నాయో చూద్దాం.. పూర్తి కథనం

10. Nellore: వైకాపాకు డిప్యూటీ మేయర్, నలుగురు కార్పొరేటర్ల రాజీనామా

నగరంలో వైకాపాకు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని