Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 May 2023 13:07 IST

1. ‘విడాకుల’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

విడాకుల (Divorce) మంజూరు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలు కలిసి జీవించలేని పరిస్థితుల్లో వారికి వెంటనే విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పరస్పర అంగీకారంతో దంపతులు విడిపోవాలనుకుంటే.. అందుకు 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదని పేర్కొంది. కొన్ని షరతులతో ఈ ఆరు నెలల నిరీక్షణ నిబంధనను సర్వోన్నత న్యాయస్థానం సడలించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తీవ్ర అసహనం.. పీఏ చెంప చెళ్లుమనిపించిన వైకాపా ఎమ్మెల్యే

తన వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సహాయకుడు (పీఏ)పై వైకాపా ఎమ్మెల్యే చేయిచేసుకున్నారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు అచ్యుతాపురం మండలంలోని మత్స్యకార గ్రామం పూడిమడకలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో సొంత పార్టీకే చెందిన మంత్రి అమర్‌నాథ్‌ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ది కేరళ స్టోరీ’.. అసలేమిటీ వివాదం..?

మరికొన్ని రోజుల్లో విడుదల కానున్న ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమాపై వివాదం మొదలైంది. మే 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై కేరళలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి సినిమాను విడుదల చేయొద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కూడా ఘాటుగా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 14 యాప్స్‌ను బ్లాక్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఉగ్రవాదుల కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్‌(Jammu and Kashmir)లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదులకు పాక్‌ (Pakistan) నుంచి వారి బాస్‌లు కోడెడ్‌ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్‌ యాప్స్‌ను కేంద్రం బ్లాక్‌ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్‌లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తుర్కియే దాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ హతం

సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌(Islamic State) గ్రూప్‌ చీఫ్‌ అబు హుస్సేన్‌ అల్‌ ఖురేషీని తాము మట్టుబెట్టినట్లు తుర్కియే(turkey) అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ ప్రకటించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘‘తుర్కిష్‌ నేషన్‌నల్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్గనైజేషన్‌ నిన్న తుర్కియేలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఇతడి కోసం ఎంతోకాలంగా వెతుకుతోంది’’ అని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కార్యకర్త అత్యుత్సాహం.. మోదీ వాహనంపై ఫోన్‌ విసిరి..!

ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్న కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఫోన్ విసిరేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ప్రధాని మోదీ ఆదివారం మైసూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై రోడ్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో భాజపాకు చెందిన మహిళా కార్యకర్త(BJP Worker) ప్రధాని వైపుగా ఫోన్‌ను విసిరేశారు. అది వాహనం బానెట్‌పై పడింది. అంత ప్రచారంలోనూ మోదీ దానిని గమనించి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్(SPG)ను అప్రమత్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రజనీకాంత్‌పై వైకాపా విమర్శలు.. తీవ్రంగా మండిపడిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ శతజయంతి కార్యక్రమంలో పాల్గొన్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా నేతల విమర్శలను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తీవ్ర అహంకారంతో అధికారపార్టీ నేతలు చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలెవరూ సహించరన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్‌ చేశారు.‘‘అన్న గారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై వైకాపా మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వచ్చే 5 ఏళ్లలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌.. WEF ఆసక్తికర నివేదిక!

వచ్చే 5 ఏళ్లలో ఈ ఉద్యోగాలకు భారీ డిమాండ్‌.. WEF ఆసక్తికర నివేదిక!ఈ దశాబ్దం ఆరంభంలోనే ఉద్యోగాల కల్పనకు కరోనా మహమ్మారి, ఆటోమేషన్‌ రూపంలో పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల తీరులో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. వచ్చే ఐదేళ్ల పాటు ఆ మార్పులు స్థిరంగా కొనసాగుతాయని తాజాగా ఓ ప్రముఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. మొత్తం నికర ఉద్యోగాల సృష్టిలో తగ్గుదల నమోదవుతుందని తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆరేళ్లకే తన నటనతో ఏడిపించి.. ఇప్పుడు నందినిగా మెప్పించి... ఎవరీ సారా అర్జున్?

నందిని (Nandini).. గతేడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను బాగా ఆకర్షించిన పాత్ర పేరు ఇది. మణిరత్నం (Maniratnam) కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan)లో ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రే ఇది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ అనే కథ మొదలు కావడానికి కీలకమైన ఈ పాత్రలో ఐశ్వర్య అదరహో అనేలా నటించారు. అయితే, ఆమెకు ఏమాత్రం తీసిపోకుండా ఆమె చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది బాలనటి సారా అర్జున్‌ (Sara Arjun). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘‘అంత ప్రేమ ఉంటే గిఫ్ట్స్‌ తీసుకురండి’’.. రోహిత్ బర్త్‌డే వీడియో వైరల్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్ శర్మకు (Rohit Sharma) ఆదివారం స్పెషల్‌డేగా గుర్తుండిపోతుంది. తన పుట్టిన రోజు జరిగిన మ్యాచ్‌లో ముంబయి విజయం సాధించడమే కాకుండా.. ఐపీఎల్‌ చరిత్రలో ఇది 1000వ మ్యాచ్‌ కావడం మరో విశేషం. రాజస్థాన్‌పై ఆరు వికెట్ల తేడాతో ముంబయి అద్భుత విజయం నమోదు చేసింది. రాజస్థాన్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో బర్త్‌డే బాయ్ రోహిత్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని