ఆరేళ్లకే తన నటనతో ఏడిపించి.. ఇప్పుడు నందినిగా మెప్పించి... ఎవరీ సారా అర్జున్?
‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) ఫేమ్ బాలనటి సారా అర్జున్ (Sara Arjun) గురించి ఈ విశేషాలు మీకు తెలుసా..?
ఇంటర్నెట్‌డెస్క్: నందిని (Nandini).. గతేడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను బాగా ఆకర్షించిన పాత్ర పేరు ఇది. మణిరత్నం (Maniratnam) కలల ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan)లో ఐశ్వర్యారాయ్ బచ్చన్ పోషించిన పాత్రే ఇది. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే కథ మొదలు కావడానికి కీలకమైన ఈ పాత్రలో ఐశ్వర్య అదరహో అనేలా నటించారు. అయితే, ఆమెకు ఏమాత్రం తీసిపోకుండా ఆమె చిన్నప్పటి పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది బాలనటి సారా అర్జున్ (Sara Arjun). ఇందులో ఆమె నటన చూశాక.. ఈ పాప ఎవరు? ఆమె గతంలో ఏమైనా సినిమాల్లో నటించిందా? అని సినీ ప్రియులు సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విశేషాలు.
- బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తే సారా అర్జున్ (Sara Arjun). బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడు, సహాయ నటుడిగా నటించారు. ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade)లో విలన్‌గా నటించి తెలుగువారికి ఆయన సుపరిచితుడయ్యాడు. ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న ‘గం గం గణేశా’లో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నాడు.
- ఏడాదిన్నర వయసులోనే సారా అర్జున్ (Sara Arjun) కెమెరా ముందుకు వచ్చింది. రాజ్ అర్జున్ కుటుంబం ఓసారి షాపింగ్ మాల్‌కు వెళ్లగా.. ఏడాదిన్నర వయసున్న సారాని చూసి ఓ వాణిజ్య ప్రకటనా సంస్థ వాళ్లు ఫిదా అయ్యారు. ఈ పాపతో ఎలాగైనా యాడ్ చేయాలని భావించి రాజ్ అర్జున్‌ను సంప్రదించారు. ఆయన అంగీకరించడంతో సారా మొదటిసారి యాడ్‌లో తళుక్కున మెరిసింది.
- మొదటి యాడ్ క్లిక్ కావడంతో ఆమెకు వరుస వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశం దక్కింది. అలా, అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె 50కు పైగా యాడ్స్‌లో నటించింది. మ్యాగీ, కల్యాణ్ జ్యువెలర్స్, క్లీనిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్.. వంటి ప్రముఖ సంస్థలు, ఉత్పత్తుల యాడ్స్‌లో ఆమె నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.
- రెండేళ్ల వయసులో సారా.. దర్శకుడు విజయ్ చిత్రీకరించిన ఓ యాడ్‌లో నటించింది. ఆమె క్యూట్‌నెస్‌కు ఫిదా అయిన విజయ్.. కొన్నేళ్ల తర్వాత తాను తెరకెక్కించిన ‘దైవ తిరుమగల్’లో నటించే అవకాశం ఇచ్చాడు. అప్పుడు సారా వయసు ఆరేళ్లు.
- విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దైవ తిరుమగల్’లో ఆయన కుమార్తెగా సారా నటించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘నాన్న’ పేరుతో విడుదల చేశారు. 2011లో ఇది తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి ఆదరణ అందుకుంది.
- ‘నాన్న’లోని కోర్టు రూమ్ సీన్ ప్రేక్షకులతో కన్నీరు పెట్టించింది. ఈ సీన్‌లో విక్రమ్ - సారా నటనకు సినీ ప్రియులు ఎంతగానో కనెక్ట్ అయ్యారు. మతిస్థిమితం సరిగ్గా లేని తన తండ్రితో ఆరేళ్ల పాప సైగలు చేస్తూ మాట్లాడటం చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు.
- ‘నాన్న’ సక్సెస్ తర్వాత సారాకు తమిళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. అలా, ఇప్పటివరకూ ఆమె 15కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో తెరకెక్కిన ‘దాగుడుమూత దండాకోర్’లో సారా కీలకపాత్ర పోషించింది.
- మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’లో సారా.. నందిని చిన్నప్పటి రోల్‌లో కనిపించింది. ‘పొన్నియిన్ సెల్వన్ -1’లో ఆమె స్క్రీన్ టైమ్ చాలా తక్కువ.
- ఇటీవల విడుదలైన ‘పొన్నియిన్ సెల్వన్-2’లో సారా తన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె యువ ఆదిత్య కరికాలుడి ప్రేయసిగా కనిపించి మెప్పించింది. కృష్ణుడి భక్తురాలిగా.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సామాన్య యువతిగా కనిపించింది. ఈ సినిమాలో సారాపై మణిరత్నం ఓ పాటనూ చిత్రీకరించారు.
- ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సారా యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఫొటోలతోపాటు షూట్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను తరచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటుంది. కెరీర్ ఆరంభంలోనే ‘పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లో నటించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇటీవల సారా పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్