Modi: కార్యకర్త అత్యుత్సాహం.. మోదీ వాహనంపై ఫోన్‌ విసిరి..!

కర్నాటకలో ప్రధాని మోదీ(Modi) పాల్గొన్న ఎన్నికల(Karnataka Elections 2023) ప్రచారంలో భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది. అందుకు ఓ భాజపా కార్యకర్త అత్యుత్సాహమే కారణం. 

Published : 01 May 2023 10:40 IST

మైసూర్‌: ప్రధాని మోదీ(PM Modi) పాల్గొన్న కర్ణాటక(Karnataka) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఫోన్ విసిరేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

ప్రధాని మోదీ ఆదివారం మైసూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై రోడ్‌ షో నిర్వహించారు. ఆ సమయంలో భాజపాకు చెందిన మహిళా కార్యకర్త(BJP Worker) ప్రధాని వైపుగా ఫోన్‌ను విసిరేశారు. అది వాహనం బానెట్‌పై పడింది. అంత ప్రచారంలోనూ మోదీ దానిని గమనించి స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్(SPG)ను అప్రమత్తం చేశారు. 

‘ప్రధాని(Modi) ఎస్‌పీజీ రక్షణలో ఉన్నారు. ఆ ఫోన్ విసిరిన మహిళ భాజపా కార్యకర్త. తర్వాత ఎస్‌పీజీ సిబ్బంది ఆ ఫోన్‌ను ఆమెకు అందించారు. అత్యుత్సాహంలో ఆమె దానిని విసిరారు. ఎలాంటి దురుద్దేశంతో ఆమె ఆ పని చేయలేదు. కానీ, మేం ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు(Karnataka Elections 2023) జరగనున్నాయి. దాంతో అధికార భాజపా, విపక్షాల ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతోంది. దానిలో భాగంగా శని, ఆదివారాలు పలు ప్రాంతాల్లో మోదీ  సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని