Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 Jul 2023 13:11 IST

1. జడ్డూతో రాపిడ్‌ఫైర్‌ రౌండ్‌.. టీమ్‌ఇండియాలో డీజే ఎవరు..? బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు..?

టీమ్‌ ఇండియాలో ఎవరు ఫన్నీగా ఉంటారు, సోషల్‌ మీడియాలో రీల్‌ కింగ్‌ ఎవరు? భలేగా ఉన్నాయి కదా ఈ ప్రశ్నలు. అచ్చంగా ఇలాంటి ప్రశ్నలకే భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటన పనుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ పాత వీడియో వైరల్‌గా మారింది. అందులోని ఆసక్తికర ప్రశ్నలు, సమాధానాలు మీ కోసం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌ తొలిప్రేమ రీరిలీజ్‌.. థియేటర్‌లో యువకుల అత్యుత్సాహం

విజయవాడలోని కపర్థి థియేటర్‌లో పవన్‌ కల్యాణ్‌ చిత్రం తొలిప్రేమ రీరిలీజ్‌ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం రాత్రి సెకండ్‌ షో సమయంలో అభిమానులు బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. థియేటర్‌లో సినిమా తెరను చించేసి, సీట్లను ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అడ్డొచ్చిన థియేటర్‌ సిబ్బందిపై యువకులు దాడికి దిగారు. దీనిపై థియేటర్‌ యాజమాన్యం స్పందిస్తూ.. విధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మహిళలు తాళిబొట్టు.. మెట్టెలు తీయాల్సిన అవసరం లేదు: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌

 తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభమైంది. వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 ఉద్యోగాలకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,878 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1(జనరల్ స్టడీస్), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పేపర్ 2 జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శంషాబాద్‌ నుంచి మూసీ వరకు ఎక్స్‌ప్రెస్‌వే: కేటీఆర్‌

హైదరాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై నార్సింగి వద్ద ₹29.50కోట్ల రూపాయలతో నిర్మించిన ఇంటర్‌ఛేంజ్‌ను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నామన్న ఆయన.. మూసీ నదిపైనా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నిద్రలోనే అనంతలోకాలకు.. కళ్లముందే కాలిపోతున్నా ఏం చేయలేకపోయాం!

మహారాష్ట్ర (Maharashtra)లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన సమయంలో ప్రయాణికుల్లో చాలామంది నిద్రిస్తున్నారని, బస్సు కాలిపోవడంతో వారు నిద్రలోనే సజీవదహనమయ్యారని తెలుస్తోంది. బుల్దానా జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు బస్సు కిటికీలు పగలగొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఈ పర్యాటక ప్రదేశంలో సూట్‌కేసులపై నిషేధం..!

సాధారణంగా ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ముందుగా మనం టికెట్‌ ధర ఎంతుందా? అని చూస్తాం. ఆ తర్వాత మనతో పాటు ఏయే వస్తువులు తీసుకెళ్లాలో ఆలోచిస్తాం. అన్నింటిని ఎంచక్కా ఓ సూట్‌కేసులో సర్దిపెట్టుకుంటాం. ఒకవేళ యూరప్‌లోని ఈ పర్యాటక ప్రదేశానికి వెళ్లాలనుకుంటే మాత్రం సూట్‌కేసును పక్కన పెట్టాల్సిందే! లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే.. అక్కడ సూట్‌కేసులు ఉపయోగించడం అక్కడ నిషేధం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తెలంగాణలో అందుబాటులోకి 134 ఉచిత వైద్య పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 134 ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా అందించే ఈ వైద్య పరీక్షలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్‌ సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వచ్చాయి. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఉచితంగా చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ ఊరు పిల్లలంతా సర్కారు బడిలోనే...

జగిత్యాల (Jagitial) జిల్లా మేడిపల్లి మండలంలోని తొంబర్రావుపేట గ్రామస్థులంతా తమ పిల్లల్ని సర్కారు బడిలోనే (Govt School) చదివిస్తున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విద్య లభిస్తుందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు 11 మంది పిల్లలతో మూతపడే స్థాయిలో ఉన్న ఈ బడి గ్రామస్థుల సహకారం, ఉపాధ్యాయుల కృషితో ప్రస్తుతం ఆదర్శ పాఠశాలగా నిలుస్తోంది. ఆ పాఠశాలలో తీసుకుంటున్న చర్యలపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫ్రాన్స్‌లో ఘర్షణలు.. కచేరీలో అధ్యక్షుడు: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

పోలీసు కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడి మృతి ఘటన ఫ్రాన్స్‌ (France)ను కుదిపేస్తోంది. పౌరులు పెద్దఎత్తున విధ్వంసాలకు పాల్పడుతూ ఆందోళనలను కొనసాగిస్తునే ఉన్నారు. మంగళవారం నుంచి ఈ ఘర్షణలు కొనసాగుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం 45 వేల మంది బలగాలను మోహరించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (Emmanuel Macron) మరో వివాదంలో చిక్కుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వాగ్నర్‌ గ్రూప్‌ తిరుగుబాటులో మా పాత్ర లేదు.. స్పష్టం చేసిన అమెరికా

రష్యాపై కిరాయి సైన్యం (Wagner Mutiny) తిరుగుబాటుతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా (America) మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు రష్యా (Russia) గూఢచారి చీఫ్‌ సెర్గీ నారిష్కిన్ (Sergei Naryshkin)కు అమెరికాకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (CIA) డైరెక్టర్‌ విలియం బర్న్స్‌ (William Burns) శుక్రవారం తెలియజేశారు. వారం క్రితం కిరాయి సైన్యమైన వాగ్నర్‌ గ్రూపు తిరుగుబాటు చేపట్టి రష్యాను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ గ్రూపు అకస్మాత్తుగా వెనక్కి తగ్గడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని