Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Jul 2023 13:12 IST

1. అతడి మరణం.. బాడీ బిల్డర్లకు ఓ హెచ్చరిక..!

జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్‌, సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌ జో లిండ్నర్‌(30) మరణం అతడి ఫాలోవర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని 85 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన ఫిట్‌నెస్‌ వీడియోలతో యూట్యూబ్‌లో దాదాపు 50 కోట్ల వీక్షణలు సొంతం చేసుకొన్నాడు. అతడు మూడు రోజుల క్రితం అరుదైన వ్యాధితో స్నేహితురాలు నిచా సమక్షంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని నిచా ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. చనిపోవడానికి కొద్దిసేపటి ముందే అతడు తనకు ఓ నెక్లెస్‌ బహూకరించినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మణిపుర్‌ హింసలో విదేశీ హస్తం: సీఎం బీరేన్‌ సింగ్‌

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌(Manipur)లో దాదాపు రెండు నెలల నుంచి చోటు చేసుకొంటున్న హింసలో విదేశీ శక్తుల హస్తం ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ (CM N Biren Singh) అనుమానం వ్యక్తం చేశారు. ఈ హింస మొత్తం ముందస్తు ప్రణాళికతో పక్కాగా అమలు చేసి ఉంటారని ఆరోపించారు. ఆయన ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ మేరకు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. 4,045 పోస్టులకు IBPS నోటిఫికేషన్‌.. డిగ్రీ పాసైతే చాలు

బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఐబీపీఎస్​ 4,045 క్లర్క్​ పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. కామన్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్థులను దేశవ్యాప్తంగా మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన శాఖల్లో నియమించనుంది.అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం(జనరల్ ₹850) చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 21. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు లేదా సెప్టెంబర్​ల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 2023 అక్టోబర్​లో జరుగుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రూ.50కే కిలో టమాట..బారులు తీరిన ప్రజలు!

మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. కర్నూలు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో కిలో టమోటా ధర ఏకంగా రూ.120కి ఎగబాకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం రాయితీపై టమాటలను విక్రయిస్తోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో (Rayachoti) కిలో రూ.50 కే విక్రయిస్తుండటంతో ప్రజలు బారులు తీరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

నెల్లూరులో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని నెల్లూరు నగర పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ హౌస్‌ సర్జన్‌ చేస్తోంది.  ఆమెకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ రోజు ఉదయం కళాశాల హాస్టల్‌ గదిలో చైతన్య బలవన్మరణానికి  పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. బ్రిడ్జి పైనుంచి రైల్వేట్రాక్‌పై పడిన కారు.. తెలుగువారికి గాయాలు!

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ నంబర్‌ హైవేపై వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ నంబర్‌ 108)పైనుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. ఈ ఘటన నాగపుర్‌- ఇంగన్‌ఘాట్‌ మార్గంలోని బోర్‌ఖేడి సమీపంలో 796/16 పాయింట్‌ వద్ద చోటుచేసుకుంది. మొత్తం నాలుగు ట్రాక్‌లు ఉండగా.. 3, 4 ట్రాక్‌ల మధ్య కారు పడింది. ఈ ప్రమాదంలో అందులోని ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రపంచం పుతిన్‌ను చంపాలనుకుంటోంది : జెలెన్‌స్కీ

తమ దేశంపై యుద్ధం కారణంగా రష్యా (Russia) కిరాయి సైన్యం వాగ్నర్‌ (Wagner) గ్రూప్‌ తీవ్రంగా దెబ్బతిందని ఉక్రెయిన్‌(Ukraine) అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రపంచం పుతిన్‌ను చంపాలనుకుంటోందని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్‌ ప్రధాని కీవ్‌ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ స్పానిష్‌ పత్రికలతో మాట్లాడుతూ.. ‘‘ఈ యుద్ధంలో కిరాయి సైన్యం భారీగా నష్టపోయింది. మా దళాలు దాదాపు తూర్పు ఉక్రెయిన్‌లోనే 21,000 మంది వాగ్నర్‌ సైనికులను హతమార్చాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఖమ్మం కాంగ్రెస్‌ సభకు రానివ్వకుండా కార్యకర్తలను భారాస భయపెడుతోంది: పొంగులేటి

ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్‌ (Congress) నిర్వహించబోయే ‘జన గర్జన’ సభను విఫలం చేసేందుకు భారాస కుట్ర చేస్తోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ సభకు రాకుండా కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే తమ మద్దతుదారులకు సంబంధించిన 1700కుపైగా వాహనాలను పోలీసులు సీజ్‌ చేసినట్టు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్విటర్‌ యూజర్లకు షాక్‌.. ట్వీట్స్‌ చూడటానికి లిమిట్‌!

ట్విటర్‌ యూజర్లకు ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. ట్వీట్స్‌ను చూడటంలో వినియోగదారులకు పరిమితులు విధించారు. వెరిఫైడ్​, అన్​వెరిఫైడ్​, కొత్త అన్​వెరిఫైడ్ ఖాతాదారులకు వేర్వేరుగా లిమిట్‌ ఇచ్చారు. ట్విటర్‌ (Twitter) సేవల్లో శనివారం రాత్రి నుంచి అంతరాయం ఏర్పడటంపై ఎలాన్‌ మస్క్ (Elon Musk) స్పందిచారు. ట్విటర్‌లో పోస్టులను వీక్షించడంపై తాత్కాలికంగా పరిమితులను తీసుకొచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఖాతాల తీరును బట్టి రోజుకు ఎన్ని పోస్టులు వీక్షించ వచ్చో కూడా ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శనివారం ఆయన ట్వీట్‌ చేసి ప్రకటించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థి సోహిత్‌ తండ్రి

వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం కొత్తపేట సమీపంలోని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలకు చెందిన విద్యార్థి సోహిత్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై తండ్రి నాగరాజు అనుమానాలు వ్యక్తం చేశారు. చనిపోయే ముందు రోజు రాత్రి సోహిత్‌ కొద్దిసేపు వసతిగృహంలో లేడని చెప్పారు. ‘‘తెల్లవారాక కడుపునొప్పి అంటూ సోహిత్‌ ఫోన్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని