Student Death: న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థి సోహిత్‌ తల్లిదండ్రులు

శ్రీధర్‌రెడ్డి పాఠశాలకు చెందిన విద్యార్థి సోహిత్‌  అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై తండ్రి నాగరాజు అనుమానాలు వ్యక్తం చేశారు.

Updated : 02 Jul 2023 13:45 IST

ఖాజీపేట: వైఎస్‌ఆర్‌ జిల్లా ఖాజీపేట మండలం కొత్తపేట సమీపంలోని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలకు చెందిన విద్యార్థి సోహిత్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై తల్లిదండ్రులు నాగరాజు, లలిత అనుమానాలు వ్యక్తం చేశారు. చనిపోయే ముందు రోజు రాత్రి సోహిత్‌ కొద్దిసేపు వసతిగృహంలో లేడని చెప్పారు. ‘‘తెల్లవారాక కడుపునొప్పి అంటూ సోహిత్‌ ఫోన్‌ చేశాడు. నా కుమారుడిని ఎవరు, ఎందుకు కొట్టారో కారణం తెలియాలి. పులివెందులకు వస్తున్న సీఎంను కలిసి విన్నవిస్తాం. మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటాం’’ అని వారు హెచ్చరించారు. 

పాఠశాల సిబ్బంది కొట్టడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఘటనపై యాజమాన్యం స్పందించకపోవడంతో రాళ్లు, కర్రలతో పాఠశాల కిటికీల అద్దాలు పగలగొట్టారు. ఫీజుల రూపంలో లక్షల రూపాయలిచ్చి తమ కుమారుడిని పోగొట్టుకున్నామంటూ విద్యార్థి తల్లి లలిత కన్నీరుమున్నీరయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని