Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Jul 2023 13:15 IST

1. రెండు దశాబ్దాల క్రితమే ఈకలు లేని కోళ్ల సృష్టి.. ఎందుకు మార్కెట్లోకి రాలేదంటే!

ఆదివారం వచ్చిందంటే చాలు నాన్‌ వెజ్‌ ప్రియులు చికెన్‌ను (Chicken) ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే ఈ కోళ్లు వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చనిపోతుంటాయి. ఆ సమస్యకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశంతో ఓ ఇజ్రాయెల్ శాస్త్రవేత్త ఈకలు లేని కోళ్లను సృష్టించాడు. వాటిలోని ప్రత్యేకత ఏంటి? ఆ రకం కోళ్లు ఇంకా ఎందుకు మన మార్కెట్లోకి రాలేదు.. తదితర విషయాల గురించి చదివేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉత్తర భారత్‌లో పలుచోట్ల రెడ్‌అలర్ట్‌.. దిల్లీలో రికార్డుస్థాయి వర్షపాతం..!

ఉత్తర భారత దేశంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఏడు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌, మూడు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. దీంతోపాటు మెరుపు వరదలు, కొండ చరియలు విరిగి పడే ముప్పు ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లలో చిక్కుకుపోయిన ఆరుగురిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భర్తతో విభేదించి.. ప్లాట్‌ అమ్మేసి.. ‘పబ్‌జీ’ ప్రేమలో మలుపులెన్నో!

 భారత్‌- పాకిస్థాన్‌ సరిహద్దులు దాటిన ‘పబ్‌జీ’ ప్రేమ కథలో మలుపులెన్నో వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్‌ గేమ్‌ ‘పబ్‌జీ (PUBG)’లో పరిచయమైన వ్యక్తి కోసం.. ఓ పాకిస్థానీ మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి భారత్‌లో అక్రమంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులు వారిని అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, అప్పటికే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు వెల్లడైంది. తననుతాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె పేర్కొనడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీఎం నిర్ణయం.. భస్మాసుర హస్తం: అమరావతి రైతులు

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు పునరుద్ఘాటించారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన తమకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్‌5 జోన్‌ పేరిట ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. అమరావతి ఉద్యమం 1300 రోజుకు చేరిన నేపథ్యంలో ‘నాలుగేళ్లుగా నరకంలో నవనగరం’ పేరిట కార్యక్రమాలు నిర్వహించారు. మందడంలో నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 13 ఏళ్ల బాలికకు.. 42 సంవత్సరాల వ్యక్తితో పెళ్లి

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలోని ఓ తండాలో బాల్య వివాహం జరిగిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు, అధికారులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బాలిక(13)కు, ఫకీరాబాద్‌కు చెందిన సాహెబ్‌రావు (42) అనే వ్యక్తితో వివాహం జరిపారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి సాహెబ్‌రావు బాలికను తీసుకుని వెళ్లిపోయాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. టొరంటోలో ఖలిస్థానీల నిరసన.. ప్రతిగా భారతీయుల ప్రదర్శన..!

కెనడా(Canada)లోని టొరంటో(Toronto) నగరంలో ఖలిస్థానీ మద్దతుదార్లు(Khalistan protests) ఆందోళన చేపట్టగా.. దీనికి దీటుగా భారత జాతీయులు కూడా స్పందించారు. శనివారం భారత కాన్సులేట్‌ కార్యాలయం ఎదుట ఇరు పక్షాలు పోటాపోటీగా జెండాలను పట్టుకొని ప్రదర్శనకు దిగాయి. తొలుత ఖలిస్థానీలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేపట్టగా.. భారత్‌కు మద్దతుగా కూడా ప్రదర్శనలు మొదలయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సెవెన్‌ స్టార్‌ హోటళ్ల నిర్మాణానికి జగన్‌ భూమి పూజ

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక స్థలం జమ్మలమడుగు మండలం గండికోటలో ఒబెరాయ్‌ హొటల్‌ నిర్మాణ పనులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. విశాఖ, తిరుపతిలో నిర్మించనున్న ఒబెరాయ్‌ హోటల్స్‌కి కూడా వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒబెరాయ్‌ హొటల్స్‌ ఎండీ, సీఈవో విక్రమ్‌ ఒబెరాయ్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 4 డాలర్లకు పడిపోనున్న రష్యా చమురు డిస్కౌంట్‌..!

రష్యా(Russia) నుంచి చౌకగా భారత్‌(India)కు లభిస్తున్న చమురు ధరల్లో మార్పులు రానున్నాయి. డిస్కౌంట్‌ 4 డాలర్లకు తగ్గిపోనున్నట్లు సమాచారం. మరోవైపు రష్యా ఏర్పాటు చేసిన చమురు రవాణా సంస్థల చార్జీలు మాత్రం ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. దీంతో దేశీయంగా చమురు ధరలపై ప్రతికూల ప్రభావం పడనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉత్తరాఖండ్‌లో నదిలో పడిన వాహనం.. తెలుగు వ్యక్తి గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లా గులార్‌ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలిస్తున్నారు. బాధితుల్లో విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టీమ్‌ఇండియా వెస్టిండీస్‌ టూర్‌.. మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ ఇదే

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత దాదాపు నెలరోజులపాటు విశ్రాంతి తీసుకున్న టీమ్‌ఇండియా (Team India) క్రికెటర్లు త్వరలో తిరిగి ప్రొఫెషనల్ క్రికెట్‌ ఆడనున్నారు. ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్‌ (West Indies)పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కరేబియన్‌ జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. టీ20 సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడాలో నిర్వహించనున్నారు. మిగతా అన్ని మ్యాచ్‌లు విండీస్‌లోనే జరగనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని