Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jul 2023 13:05 IST

1. శ్రీకాళహస్తి సీఐపై ఎస్పీకి పవన్‌ ఫిర్యాదు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన

రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం

ఔటర్‌ రింగ్‌రోడ్డు (ORR)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శామీర్‌పేట - కీసర మధ్యలో ఈ ఘటన జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఘట్‌కేసర్‌ నుంచి మేడ్చల్‌ వైపు వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ పైనుంచి దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం, కారును ఢీ కొట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శ్రీశైలం, శ్రీకాళహస్తిలో భారీగా భక్తుల రద్దీ

శివుడిని ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలివెళ్లారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల వద్ద వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబికా దేవిలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహిళా రైతులతో సోనియా డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తన నివాసానికి వచ్చిన రైతులతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ పంచుకోగా.. వైరల్‌గా మారింది. ఈ నెల 8న రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామంలో మహిళా రైతులు.. దిల్లీలోని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంటిని చూడాలని కోరారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్  (Madhya Prdaesh) రాజధాని భోపాల్‌ నుంచి దిల్లీ వెళ్తున్న ఈ రైల్లో  (Bhopal-Delhi Train) మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మణిపుర్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి!

మణిపుర్‌ (Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిలిటెంట్లు ఒక మహిళను కాల్చి చంపారు. 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న లూసి మారిమ్‌ (55) అనే మహిళపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. విపక్షాల భేటీకి శరద్‌ పవార్‌ రాక ఖాయమే.. కానీ!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవడమే లక్ష్యంగా విపక్ష రాజకీయ పార్టీలు మరోసారి సమావేశానికి (Opposition Meet) సిద్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు వేదికగా సోమ, మంగళవారాల్లో ఈ భేటీ జరగనుంది. అయితే ఈ సమావేశానికి నేషనలిస్ట్ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గంగమ్మ ఉగ్రరూపం.. హరిద్వార్‌కు అలర్ట్‌

భారీ వర్షాల (Heavy Rains)తో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు దిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తుండగా.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో గంగా నది (Ganga Rover) ఉగ్రరూపం దాల్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 8. అమెరికాలో పిడుగుల అలజడి.. 2,600 విమానాల రద్దు..

అమెరికా(USA)లో పిడుగులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా దాదాపు 2,600 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని ఈశ్యాన్య ప్రాంతంలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని