Manipur: మణిపుర్‌లో కాల్పులు.. ఇద్దరి మృతి!

మణిపుర్‌ (Manipur)లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాల్లో మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Updated : 17 Jul 2023 12:14 IST

ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మిలిటెంట్లు ఒక మహిళను కాల్చి చంపారు. 24 గంటల్లో వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న లూసి మారిమ్‌ (55) అనే మహిళపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. కాల్పుల అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. ఈ ఘటన తూర్పు ఇంఫాలోని కెయిబి హేకాక్‌ మాపాల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కాంగ్‌పోక్పి జిల్లాలోని తంగ్‌బుహ్‌ గ్రామంలో జాంగ్‌ఖోలున్ హౌకిప్(34) అనే మరో వ్యక్తి కాల్పులకు బలి అయ్యాడు.

తొడగొడుతూ.. వికటాట్టహాసం చేస్తూ.. సీఐ అంజూయాదవ్‌ మరో వీడియో వైరల్‌

మహిళ మృతితో సంబంధమున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బాంబులు,  ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరం ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఈ ఘటనలు చూస్తుంటే శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది’’ అని ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలకు వ్యతిరేకంగా గిరిజన కమిటీ జాతీయ రహదారిపై 72 గంటలపాటు నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆదివారం కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలు గస్తీ నిర్వహించాయి. ఐదు బంకర్లను ధ్వంసం చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని