Chandrababu: ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు చంద్రబాబు సూచన

రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు.

Updated : 17 Jul 2023 11:48 IST

అమరావతి: రాష్ట్రంలో జూలై 21 నుంచి నెల రోజుల పాటు జరిగే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పట్ల ఏపీ ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వచ్చి చేపట్టే ఓటర్ వెరిఫికేషన్‌లో తమ ఓటు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలన్నారు. ఓటు లేకపోతే తక్షణమే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు అందరి బాధ్యతన్న చంద్రబాబు.. ఓటుతోనే భద్రత, భవిష్యత్తుకు భరోసా అని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ఓటు మన బాధ్యత.. ఓటుతో భద్రత’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్‌ చేశారు.  

Nara Lokesh: వెలిగొండ పూర్తి చేస్తానని ఆరుసార్లు తేదీలు మార్చారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని