శ్రీశైలం, శ్రీకాళహస్తిలో భారీగా భక్తుల రద్దీ

శివుడిని ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలివెళ్లారు.

Updated : 17 Jul 2023 14:10 IST

శ్రీశైలం, శ్రీకాళహస్తి: శివుడిని ప్రీతికరమైన సోమవారం రోజు అమావాస్య కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు తరలివెళ్లారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల వద్ద వేకువజాము నుంచే రద్దీ నెలకొంది. 

శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబికా దేవిలను తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, అతి శీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో శ్రీశైలంలోని పురవీధులు కిటకిటలాడుతున్నాయి.

మరోవైపు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే బారులు తీరారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిఫార్సులు, అడ్డదారిలో భక్తులను అనుమతించడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి క్యూలైన్‌లో పడిగాపులు కాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని