Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Jul 2023 13:13 IST

1. రిషి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ.. రెండుస్థానాల్లో ఓటమి..!

బ్రిటన్‌లో రిషి సునాక్‌ (Rishi Sunak) నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం మూడు పార్లమెంట్‌ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల పార్టీ ఓటమి పాలైంది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే-అయిన్‌స్టీ సీటులో లేబర్‌ పార్టీ  గెలుపొందింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్‌ పార్టీ భారీ మెజార్టీని పొందింది. ఇక మరో స్థానమైన సోమర్టన్‌-ఫ్రోమ్‌ను లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ గెలుచుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అల్పపీడనం.. మరో 24గంటల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

 మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వివరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నాం: సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జ్‌షీట్‌లో సీబీఐ పలు అంశాలను ప్రస్తావించింది. ఫొటోలు, గూగుల్‌ టేకౌట్‌, ఫోన్ల లొకేషన్‌ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది. గత నెల 30న సమర్పించిన ఛార్జ్‌షీట్‌ను సీబీఐ కోర్టు ఇటీవల విచారణకు స్వీకరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైదరాబాద్‌ To తిరుపతి విమాన ప్రయాణం.. ఆపై శ్రీనివాసుని దర్శనం

కలియుగ వైకుంఠం తిరుమలలో వెలసిన శ్రీనివాసుడిని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. దక్షిణ భారతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని పరితపిస్తుంటారు. అయితే, తిరుమల ప్రయాణమంటే మాటలా? అటు దర్శనంతో పాటు ఇటు ప్రయాణ టికెట్లూ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలంటే పక్కాగా ప్లాన్‌ చేసుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎలాన్‌ మస్క్‌కు ‘టెస్లా’ షాక్‌.. ఒక్క రోజే రూ.1.64లక్షల కోట్లు ఆవిరి

ట్విటర్‌, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు భారీ షాక్‌ తగిలింది. టెస్లా షేర్ల భారీ పతనం (Tesla shares tumble)తో మస్క్‌ ఒక్కరోజే ఏకంగా 20.3 బిలియన్‌ డాలర్ల (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.64లక్షల కోట్లకు పైమాటే) సంపదను కోల్పోయారు. అయినప్పటికీ ఇంకా ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాజాం మండలం మొగిలివలసకు చెందిన శ్రీహరి (28) శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. వాకింగ్‌ చేస్తుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీహరి కుప్పకూలిపోయాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. టెలికాంతో పాటు ఫైబర్‌సేవలు.. వొడాఫోన్‌ కొత్త సర్వీసులు..

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) తమ కస్టమర్ల కోసం కొత్తగా వీఐ వన్‌ (Vi One) సర్వీసులను ప్రారంభించింది. వీఐ వన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్లతో ఫైబర్‌ సేవలు, ఓటీటీలతో పాటు ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను కూడా అందించనుంది.  గతంలో భారతీ ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ ఎయిర్‌టెల్‌ పేరుతో ఇటువంటి సేవలనే తీసుకొచ్చింది. వీఐ వన్‌ సర్వీసులతో వొడాఫోన్‌ ఐడియా సైతం నాలుగు ప్లాన్లను తమ యూజర్లకు పరిచయం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మా క్లస్టర్‌ ఆయుధాలు రష్యాపై వాడుతున్నారు..: శ్వేతసౌధం

తాము సరఫరా చేసిన క్లస్టర్‌ ఆయుధాలను ఉక్రెయిన్‌ (Ukraine ) సేనలు.. రష్యా దళాలపై వాడుతున్నాయని అమెరికాలోని శ్వేత సౌధం (White House) ధ్రువీకరించింది. నేషనల్‌ సెక్యూరిటీ ప్రతినిధి జాన్‌ కిర్బి మాట్లాడుతూ రష్యా సైన్యం స్థావరాలు, ఆపరేషన్లపై ఇవి చాలా ప్రభావం చూపుతున్నాయని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా పోర్టు తదితర కీలక ప్రాంతాలపై రష్యా ఎడతెరిపి లేకుండా క్షిపణి దాడులు చేస్తోంది. దీంతో 19 మంది గాయపడ్డారు. ఫలితంగా ఉక్రెయిన్‌ దళాలు క్లస్టర్‌ ఆయుధాల వినియోగం ప్రాంభించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పరువునష్టం కేసులో రాహుల్‌ పిటిషన్‌.. ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

‘మోదీ ఇంటి పేరు’పై వ్యాఖ్యలకు నమోదైన పరువు నష్టం కేసు (Defamation case)లో తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాది అయిన గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేశ్ మోదీతో పాటు గుజరాత్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. దీనికి రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చిన్నారికి వేడి చికెన్‌ నగెట్స్‌.. మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల ఫైన్‌..!

చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ (McDonald)కు భారీగా ఫైన్‌ పడింది. ఈ ఘటన అమెరికా(USA)లో చోటు చేసుకొంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని ఫోర్ట్‌ లాడర్‌డేల్‌ సమీపంలో మెక్‌డొనాల్డ్స్‌ డ్రైవ్‌ ఇన్‌కు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది. అక్కడ హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని