Vodafone Idea: టెలికాంతో పాటు ఫైబర్‌సేవలు.. వొడాఫోన్‌ కొత్త సర్వీసులు..

Vodafone Idea: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా ‘వీఐ వన్‌’ పేరుతో సరికొత్త సర్వీసులను ప్రారంభించింది. ఈ ప్లాన్‌తో ఫైబర్‌ సేవలు, ఓటీటీలతో పాటు ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను కూడా అందించనుంది.

Published : 21 Jul 2023 12:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) తమ కస్టమర్ల కోసం కొత్తగా వీఐ వన్‌ (Vi One) సర్వీసులను ప్రారంభించింది. వీఐ వన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్లతో ఫైబర్‌ సేవలు, ఓటీటీలతో పాటు ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను కూడా అందించనుంది.  గతంలో భారతీ ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ ఎయిర్‌టెల్‌ పేరుతో ఇటువంటి సేవలనే తీసుకొచ్చింది. వీఐ వన్‌ సర్వీసులతో వొడాఫోన్‌ ఐడియా సైతం నాలుగు ప్లాన్లను తమ యూజర్లకు పరిచయం చేసింది.

93 రోజుల ప్లాన్‌

రూ.2,912 రీఛార్జ్ చేసుకుంటే ప్రీపెయిడ్‌ కనెక్షన్‌ కింద అపరిమిత కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. ఫైబర్‌ కనెక్షన్‌తో 40 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. వీటితో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌, సోనీలివ్‌ ఓటీటీ సేవలు మొబైల్‌లో పొందవచ్చు. వీఐ మూవీస్‌, టీవీ వీఐపీ, జీ5 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను 90 రోజులు ఉచితంగా పొందవచ్చు. రూ.3,109 ప్లాన్‌తో వచ్చే ఫైబర్‌ కనెక్షన్‌తో 100 Mbps వేగంతో అపరిమిత డేటా లభిస్తుంది. వీటితో పాటు రూ.2192 ప్లాన్‌లోని అన్ని సదుపాయాలు ఇందులోనూ ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లు 93 రోజుల వ్యాలిడిటీతో వస్తున్నాయి.

హైదరాబాద్‌ To తిరుపతి విమాన ప్రయాణం.. ఆపై శ్రీనివాసుని దర్శనం

లాంగ్‌ టర్మ్‌ ప్లాన్స్‌

వొడాఫోన్‌ ఐడియా రూ.8530, రూ.12,155 ఈ రెండు లాంగ్‌ టర్మ్‌ ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.2,192 ప్లాన్‌లోని అన్ని బెనిఫిట్స్ రూ.8530లో లభిస్తాయి. అలాగే రూ.3,109 ప్లాన్‌లోని అన్ని సదుపాయాలు రూ.12,155 ప్లాన్‌లో ఉంటాయి. ఈ రెండు ప్లాన్లతో 368 రోజుల వ్యాలిడితో పాటు ప్రీపెయిడ్‌ కనెక్షన్‌, అపరిమిత కాల్స్‌, రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీఐ తీసుకు వచ్చిన ఈ నాలుగు కొత్త ప్లాన్లలో బింజ్‌ (Binge) ఆల్ నైట్ ఆఫర్ లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని