Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jul 2023 13:27 IST

1. అక్రమ వలసదారులను గుర్తించేందుకు మణిపుర్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌(Manipur)లో శాంతి నెలకొల్పేందుకు అధికారులు దిద్దిబాటు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మయన్మార్‌(Myanmar) నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించిన వారిని గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం మణిపుర్‌ ప్రజల నుంచి బయోమెట్రిక్‌ డేటాను సేకరిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మాస్కో విమానాశ్రయంపై డ్రోన్ల దాడి

రష్యా (Russia) రాజధాని మాస్కో(Moscow)పై ఆదివారం డ్రోన్లు విరుచుకుపడ్డాయి. నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ పలు డ్రోన్లను కూల్చివేసిందని పేర్కొంది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నాయి. మొత్తం మూడు డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నర్సాపురం-ధర్మవరం రైలుకు తప్పిన పెను ప్రమాదం

నెల్లూరు జిల్లా కావలి-బిట్రగుంట రైల్వేస్టేషన్ల మధ్య పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కావలి-బిట్రగుంట మధ్య ఎగువమార్గంలో ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెండు మీటర్ల రైలు పట్టా ముక్కను ట్రాక్‌పై అడ్డుగా పెట్టారు. ఈ క్రమంలో నర్సాపురం-ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అదేమార్గంలో వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టీఎఫ్‌సీసీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్‌

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరిగే ఈ ఎన్నికల్లో 2023-25 ఏడాదికి గాను నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఎన్నుకోనున్నారు. అధ్యక్ష స్థానానికి నిర్మాతలు దిల్‌ రాజు, సి.కల్యాణ్‌ పోటీపడుతున్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ మనుగడ, భవిష్యత్‌ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే నినాదంతో దిల్‌ రాజు ప్యానెల్‌.. చిన్నసినిమాల మనుగడ, డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీల తగ్గింపు హామీలతో సి.కల్యాణ్‌ ప్యానెల్‌ బరిలో నిలిచాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం..

నగరంలోని ట్యాంక్‌బండ్‌పై కొత్త కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ మార్గ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. హుస్సేన్‌సాగర్‌ గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు వ్యక్తులున్నారు. కారులోని ఎయిర్‌ బెలూన్ తెరుచుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిద్దరూ కారు వదిలి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ సహాయంతో కారును తొలగించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చీరలో ఉన్న ఫొటోలు పంపించు.. మహిళా ఉద్యోగికి సీఐడీ అధికారి వేధింపులు!

తెలంగాణ సీఐడీ డీఎస్పీ కిషన్‌సింగ్‌పై కేసు నమోదైంది. కిషన్‌ సింగ్‌ తనను వేధిస్తున్నారంటూ టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ మహిళా ఉద్యోగి చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిషన్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ‘‘కిషన్‌సింగ్‌.. అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు నా ఫోన్‌కు పంపిస్తున్నారు..పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మూలపేట పోర్టు వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపడుతున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. మూలపేట పోర్టుకు వచ్చే వాహనాలను విష్ణుచక్రం గ్రామస్థులు ఆదివారం అడ్డుకుని ధర్నా చేపట్టారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని ఆందోళనకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సాక్షి హత్య కేసులో అతిక్‌ అహ్మద్‌ లాయర్‌ అరెస్ట్‌..!

ఉమేశ్‌ పాల్‌ హత్య కేసులో పోలీసులు అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmed) లాయర్‌ విజయ్‌ మిశ్రాను అరెస్టు చేశారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య కేసులో ఉమేశ్‌ ప్రధాన సాక్షి. అతడిపై అతీక్‌ అహ్మద్‌ కుమారుడు, మరికొందరు వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు ఉత్తరప్రదేశ్‌ను కుదిపేశాయి. వాస్తవానికి హత్యకు ముందు ఉమేశ్‌పాల్‌ లొకేషన్‌ను లాయర్‌ విజయ్‌నే హంతకులకు చేరవేసినట్లు తేలింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నా పేరు ముందు సూపర్‌ స్టార్‌ ఎందుకు..?: రజనీకాంత్‌

రజనీకాంత్‌ ( Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. అందులో రజనీకాంత్‌ స్పీచ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. తన పేరుకు ముందు సూపర్‌ స్టార్‌ అని రాయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమరవీరుల కోసం ‘మేరీ మాటి మేరా దేశ్‌’.. మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రకటన

ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ (PM Narendra Modi) ‘మన్‌ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమం ద్వారా ఆల్‌ ఇండియా రేడియోలో మాట్లాడుతారు. ఈ వారం 103 ఎపిసోడ్‌లో మోదీ కీలక ప్రకటన చేశారు. ‘మేరీ మాటి మేరా దేశ్‌’ (Meri Mati Mera Desh) పేరుతో కొత్త ప్రచారానికి  శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని గౌరవించుకుంనేందుకు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని