Hyderabad: ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం..

ట్యాంక్‌బండ్‌పై కొత్త కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ మార్గ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 30 Jul 2023 10:58 IST

హైదరాబాద్: నగరంలోని ట్యాంక్‌బండ్‌పై కొత్త కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్‌ మార్గ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు.. హుస్సేన్‌సాగర్‌ గ్రిల్స్‌ను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఇద్దరు వ్యక్తులున్నారు. కారులోని ఎయిర్‌ బెలూన్ తెరుచుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం వారిద్దరూ కారు వదిలి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. క్రేన్ సహాయంతో కారును తొలగించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని