Rajinikanth: నా పేరు ముందు సూపర్‌ స్టార్‌ ఎందుకు..? : రజనీకాంత్‌

రజనీకాంత్‌, తమన్నా నటించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల మందుకు రానుంది.

Published : 30 Jul 2023 11:23 IST

హైదరాబాద్‌: రజనీకాంత్‌ ( Rajinikanth) హీరోగా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. అందులో రజనీకాంత్‌ స్పీచ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. తన పేరుకు ముందు సూపర్‌ స్టార్‌ అని రాయడం తనకు ఇష్టం లేదని చెప్పారు.

‘‘ఈ సినిమాలోని ‘హుకుం’ పాట విడుదల చేసినప్పుడు అందులో నా పేరుకు ముందు వచ్చే సూపర్‌ స్టార్‌ అనే పదాన్ని తీసేయాలని దర్శక నిర్మాతలను కోరాను. గతంలోనూ ఈ ట్యాగ్‌ తీసేయాలని కొందరు దర్శకులను అడిగాను. దీంతో ఎప్పుడూ సమస్యే’’ అని రజనీకాంత్ అన్నారు. ఇక ఒకప్పుడు తాను మద్యం తాగే వాడినని రజనీ గుర్తుచేసుకున్నారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అదేనన్నారు. ఆరోగ్యం, ఆనందం రెండింటిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని.. దానికి దూరంగా ఉండాలని అభిమానులకు రజనీ విజ్ఞప్తి చేశారు.

ఇలాంటి సినిమా తీసినందుకు సిగ్గుపడాలి.. ఇకనైనా డైరెక్షన్‌ ఆపెయ్‌: దర్శకుడిపై నటి ఆగ్రహం

ఇక నెల్సన్‌తో (Nelson Dilipkumar) సినిమా చేయడంపై మాట్లాడుతూ..‘‘ఇటీవల నెల్సన్‌ దిలీప్ కుమార్‌, విజయ్‌ కాంబోలో వచ్చిన ‘బీస్ట్‌’ నెగెటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ నిర్మాతలకు నష్టాలు రాలేదు. ఒక మంచి దర్శకుడు ఎప్పటికీ ఫెయిల్ అవ్వడు. తాను ఎంచుకున్న కథలో చిన్న మార్పులు ఉండొచ్చేమో గానీ.. తన దర్శకత్వంలో ఎలాంటి లోపం ఉండదు. మనం ఒక పని చేస్తున్నామంటే విమర్శించే వారు చాలా మంది ఉంటారు. వాళ్లను పట్టించుకుంటే ముందుకు సాగలేం’’ అని రజనీకాంత్ అన్నారు.

రజనీకాంత్‌ సరసన తమన్నా (Tamannaah) నటించిన ‘జైలర్‌’పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇందులో మలయాళ హీరో మోహన్‌ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌, బాలీవుడ్‌ యాక్టర్‌ జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు