Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Aug 2023 13:16 IST

1. క్రెడిట్‌ కార్డు ఇలా వాడితే ఓకే.. ‘మినిమమ్‌’ కడితే మోతే..!

ఒకప్పుడు క్రెడిట్‌ కార్డ్‌ (Credit card) తీసుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు బ్యాంకులు చాలా సులువుగా వీటిని జారీ చేస్తున్నాయి. మెరుగైన క్రెడిట్‌ స్కోర్‌ ఉంటే సులువుగా క్రెడిట్ కార్డును అందించడంతో పాటు, కొన్ని ప్రయోజనాలనూ అందిస్తున్నాయి.  దీంతో క్రెడిట్‌ కార్డు వినియోగం బాగా పెరిగింది. అదే సమయంలో కార్డు వినియోగదారులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన బకాయిలూ బాగా పెరుగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ట్రాఫిక్ ఎఫెక్ట్‌.. భారీగా నష్టపోతున్న బెంగళూరు..!

దేశ ఐటీ రాజధాని బెంగళూరు(Bengaluru )లో ట్రాఫిక్‌(Traffic)ను దాటుకొని, గమ్యస్థానాలకు చేరాలంటే కొన్నిగంటలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిపై నెటిజన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలు సోషల్‌ మీడియాలో పంచుకోవడం చూస్తూనే ఉంటాం. ఇలా ట్రాఫిక్ అంతరాయాలు, సిగ్నళ్ల వద్ద వేచి ఉండటం వంటి వాటి వల్ల సమయం, ఇంధనం వృథా కావడంతో బెంగళూరు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గద్దర్‌ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి..ఫొటో గ్యాలరీ

ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్‌ భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. వివిధ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలు అంజలి ఘటించారు. కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలంగాణ శానససభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేజ్ ఫైట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. మస్క్‌ ట్వీట్‌కు జుకర్‌ కౌంటర్‌

అమెరికా టెక్‌ దిగ్గజాలు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) మధ్య కేజ్‌ ఫైట్‌ (cage fight) ఖాయంగానే కన్పిస్తోంది. దీనిపై మస్క్‌ ఆదివారం చేసిన ఓ ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. తమ మధ్య జరిగే పోరు ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని స్పేస్‌ఎక్స్‌ అధినేత చెప్పారు. అయితే, ఈ ట్వీట్‌కు జుకర్‌బర్గ్‌ స్పందిస్తూ మస్క్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఇంతకంటే మంచి వేదిక లేదా? అంటూ ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీ సీఎంవోలో ఒక్కో పనికి ఒక్కో ధర: నాదెండ్ల

జనసేన రోజురోజుకూ బలపడుతోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. జనసేన పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికిపోతున్నారని ఆయన విమర్శించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రైవేటు సంస్థలకు పంపిస్తోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Rahul Gandhi: లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్‌

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సోమవారం పార్లమెంట్‌ (Parliament)లో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు స్టేతో లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించింది. దీంతో నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్‌ లోక్‌సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన్ను ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రియుడిపై కోపం.. 80 అడుగుల హైటెన్షన్‌ విద్యుత్‌ టవరెక్కిన బాలిక!

ప్రేమికుల మధ్య గొడవ జరిగితే.. మాట్లాడుకోకపోవడం, కొన్నాళ్లు దూరంగా ఉండడం, బతిమాలించుకోవడం చేస్తుంటారు. కానీ ఒక బాలిక ప్రియుడిపై కోపంతో ఏకంగా 80 అడుగుల విద్యుత్‌ టవర్‌ ఎక్కేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ ( Chhattisgarh)లోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మా కార్యకర్తలను హింసిస్తే మూల్యం తప్పదు: చంద్రబాబు హెచ్చరిక

పుంగనూరులో తెదేపా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న తెదేపా నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అరెస్టు చేసి కస్టడీలో కార్యకర్తలను హింసకు గురిచేస్తే.. అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నూహ్‌ అల్లర్ల కేసు.. రోహింగ్యాల అరెస్టు.. కూల్చివేతలపై హైకోర్టు స్టే

హరియాణా(Haryana)లోని నూహ్‌ (Nuh)లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి పోలీసులు పలువురు రోహింగ్యా వలసదారులను అరెస్టు చేశారు. జులై 31న నూహ్‌లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి ఘటనలో రోహింగ్యాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ‘‘మేం సేకరించిన ఆధారాల ద్వారా రాళ్లదాడి ఘటనలో పాల్గొన్నవారిని గుర్తించాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. దిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో చెలరేగిన మంటలు

దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. ఈ గది కింది అంతస్తులో ఎమర్జెన్సీ వార్డు కూడా ఉండటంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని