Haryana Violence: నూహ్‌ అల్లర్ల కేసులో రోహింగ్యాల అరెస్ట్‌.. కూల్చివేతలపై హైకోర్టు స్టే

నూహ్‌ అల్లర్ల కేసుకు సంబంధించి పలువురు రోహింగ్యా శరణార్థులను హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉండటంతో కొన్ని గంటలపాటు కర్ఫ్యూ సడలించినట్లు అధికారులు తెలిపారు. 

Updated : 07 Aug 2023 13:00 IST

గురుగ్రామ్‌: హరియాణా (Haryana)లోని నూహ్‌ (Nuh)లో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న అల్లర్లకు సంబంధించి పలువురు రోహింగ్యా వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. జులై 31న నూహ్‌లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి ఘటనలో రోహింగ్యాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ‘‘మేం సేకరించిన ఆధారాల ద్వారా రాళ్లదాడి ఘటనలో పాల్గొన్నవారిని గుర్తించాం. వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తున్నాం’’ అని నూహ్‌ జిల్లా పోలీసు అధికారి నరేంద్ర బిజార్నియా తెలిపారు. 

కూల్చివేతలపై హైకోర్టు స్టే

మరోవైపు నూహ్‌లో కూల్చివేతలపై పంజాబ్‌- హరియాణా హైకోర్టు స్టే విధించింది. అల్లర్ల కేసును సుమోటోగా స్వీకరించి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. కూల్చివేతలపై వ్యతిరేకత రావడంతో స్టే విధించింది. రాళ్ల దాడిలో పాల్గొన్న నిందితుల ఇళ్లను హరియాణా పట్టణాభివృద్ధి శాఖ అధికారులు గత కొద్దిరోజులుగా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. స్టే నేపథ్యంలో కూల్చివేతలను నిలిపివేశారు.

మళ్లీ లోక్‌సభకు రాహుల్‌ గాంధీ.. అనర్హత ఎత్తివేసిన లోక్‌సభ

ఆధారాలతోనే కూల్చివేతలు

హరియాణా పట్టణాభివృద్ధి శాఖ భూములను కొందరు శరణార్థులు ఆక్రమించి కట్టడాలు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ఇటీవల రాళ్లదాడుల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభించడంతో.. ఇక్కడి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు స్టేకు ముందు అధికారులు వెల్లడించారు. వీటిలో రోహింగ్యా శరణార్థులకు చెందిన 50కి పైగా నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు తెలిపారు. మరోవైపు పరిస్థితులు అదుపులోకి రావడంతో సోమవారం కూడా నాలుగు గంటలపాటు కర్ఫ్యూ సడలించినట్లు నూహ్‌ డిప్యూటీ కమిషనర్‌ ధీరేంద్ర ఖడ్‌గతా తెలిపారు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలను కొంత సమయంపాటు తెరిచే ఉంచుతామని అధికారులు వెల్లడించారు. ఇప్పటిదాకా ఈ అల్లర్లకు సంబంధించి 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, 147 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు