Rahul Gandhi: లోక్‌సభలో అడుగుపెట్టిన రాహుల్‌

నాలుగునెలల తర్వాత తన సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంట్‌కు వచ్చారు.

Updated : 07 Aug 2023 13:01 IST

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సోమవారం పార్లమెంట్‌ (Parliament)లో అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు స్టేతో లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ పునరుద్ధరించింది. దీంతో నాలుగు నెలల తర్వాత తొలిసారి రాహుల్‌ లోక్‌సభకు వచ్చారు. సభలోకి వచ్చేముందు ఆయన పార్లమెంట్‌ ప్రాంగణంలోని మహాత్ముడి విగ్రహానికి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయన్ను ఆహ్వానించారు.

‘మోదీ ఇంటి పేరు (Modi Surname Case)’పై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో రాహుల్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం (Lok Sabha secretariat) సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో రాహుల్‌ పార్లమెంట్‌కు వచ్చిన సమయంలో ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు మరో నేత అధిర్ రంజన్ చౌధరీ నోరు తీపి చేశారు. నేతలంతా స్వీట్లు తినిపించుకున్నారు.

రాహుల్‌ గాంధీపై అనర్హత ఎత్తివేసినలోక్‌సభ

ట్విటర్‌ బయోలో మార్పు చేసిన రాహుల్‌

సభ్యత్వ పునరుద్ధరణతో రాహుల్ తన ట్విటర్‌ బయోలో మార్పు చేశారు. ఇంతకాలం డిస్‌క్వాలిఫైడ్ ఎంపీగా ఉన్న స్థానంలో మెంబర్‌ ఆఫ్ పార్లమెంట్‌గా మార్చుకున్నారు. ఇదిలా ఉంటే.. మణిపుర్ అంశంపై విపక్షాల నిరసనలతో లోక్‌సభ మరోసారి వాయిదా పడింది.  సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు