Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్నిప్రమాదం.. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో చెలరేగిన మంటలు

దిల్లీ ఎయిమ్స్‌ (Delhi AIIMS)లోని ఎండోస్కోపీ గదిలో మంటల చెలరేగాయి. దీంతో రోగులు భయాందోళనకు గురయ్యారు.

Updated : 07 Aug 2023 13:04 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పాత ఓపీడీ భవనంలోని రెండో అంతస్తులో ఉన్న ఎండోస్కోపీ గదిలో మంటలు చెలరేగాయి. ఈ గది కింది అంతస్తులో ఎమర్జెన్సీ వార్డు కూడా ఉండటంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎయిమ్స్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎండోస్కోపి గదిలోని రోగులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆరు ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని దిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు