Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Aug 2023 13:17 IST

1. Hyderabad: మళ్లీ భూముల వేలం.. ఈసారి 3 జిల్లాలతో HMDA జాబితా

మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రంగారెడ్డిలోని బైరాగిగూడ, మంచిరేవుల, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్‌, చందానగర్‌, పీరంచెరువు.. మేడ్చల్‌ - మల్కాజ్‌గిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం.. సంగారెడ్డిలో వెలిమల, నందిగాయ, అమీన్‌పూర్‌, పతిఘనపూర్‌, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లైఫ్‌లైన్‌ ప్రాజెక్టుకు లైఫే లేకుండా చేశారు: నారా లోకేశ్‌ ట్వీట్‌

బ్రిటిష్‌ పాలన కంటే ఘోరమైన పాలన ఏపీలో సాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సంందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు.‘‘భారతదేశ స్వాతంత్ర్య సమర నినాదం క్విట్‌ ఇండియా. 1942 ఇదే రోజున క్విట్‌ ఇండియా అని నినదిస్తే బ్రిటిష్‌ వాళ్లు ప్రజలను జైళ్లలో పెట్టేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రిటిష్‌ వాళ్లకు మించిన పాలన జరుగుతోంది. ఇప్పుడు మన జన నినాదం ‘క్విట్‌ సైకో జగన్‌ - సేవ్‌ ఏపీ’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘మణిపుర్‌లో దేశాన్ని హత్య చేశారు..’ : లోక్‌సభలో నిప్పులుచెరిగిన రాహుల్‌

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Trust Motion)పై రెండోరోజు చర్చ ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 12 గంటలకు అవిశ్వాసంపై చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. తన లోక్‌ సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత ఆయన తొలిసారిగా మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విజయనగరంలోనే ఉంటాం.. దమ్ముంటే వచ్చి అరెస్టు చేసుకోండి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి సవాల్‌

రాష్ట్ర పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి విమర్శించారు. అంగళ్లు ఘర్షణ ఘటనలో తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విజయనగరంలో ఉన్న భూమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సహా తామంతా విజయనగరంలోనే ఉన్నామని.. దమ్ముంటే వచ్చి అరెస్టు చేసుకోవాలని సవాల్‌ విసిరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈగల బెడద తట్టుకోలేక.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గ్రామస్థులు

కుటుంబ కలహాలతో లేదా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం పలువురు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి బెదిరించిన ఘటనలు ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో (social media) తరచుగా చూస్తున్నాం. కానీ.. ఓ గ్రామంలో తీవ్ర సమస్యగా మారిన ఈగల (flies) బెడదను తట్టుకోలేక పలువురు స్థానికులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన చేపట్టారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. రూ.45,000 జీతంతో రిటైర్మెంట్‌.. అక్రమంగా పోగేసింది రూ.10 కోట్లు..!

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో రూ.45,000 జీతంతో స్టోర్‌ కీపర్‌గా రిటైరైన ఓ వ్యక్తి.. దాదాపు రూ.10 కోట్లు అక్రమంగా పోగేసినట్లు లోకాయుక్త అధికారుల తనిఖీల్లో తేలింది. రాష్ట్రంలోని ఆరోగ్యశాఖలో అష్ఫాక్‌ అలీ స్టోర్‌ కీపర్‌గా రిటైరయ్యారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లోకాయుక్తకు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టింది. భోపాల్‌లోని అలీ ఇంటిపై నిర్వహించిన దాడుల్లో రూ.46 లక్షల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు దొరికాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మీరు కూర్చోండి.. లేకపోతే..!: సహచర ఎంపీపై సహనం కోల్పోయిన కేంద్రమంత్రి

అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె(Narayan Rane) వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మంగళవారం శివసేన(యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌(Arvind Sawant)ను ఉద్దేశించి మాట్లాడుతూ సహనం కోల్పోయారు. దీంతో ఆయన ప్రవర్తనను విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. ప్రధానిమంత్రిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సావంత్‌కు లేదంటూ దిగువ సభలో నారయణ రాణె(Narayan Rane) ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొడాలి నాని వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానుల నిరసన.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా గుడివాడలో అగ్ర కథానాయకుడు చిరంజీవి అభిమానులు బుధవారం ఆందోళనకు దిగారు. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సైబర్‌ దాడులు తట్టుకొనేందుకు రంగంలోకి ‘మాయ’.. రక్షణ శాఖ నిర్ణయం

భారత్‌లోని రక్షణశాఖ (Defence Ministry) వెబ్‌సైట్లు, కంప్యూటర్లపై సైబర్‌ దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన తమ శాఖలోని కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను.. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మాయ’ ఓఎస్‌తో భర్తీ చేయనుంది. ‘మాయ’ను ఓపెన్‌ సోర్స్‌ ఉబంటు ఆధారంగా రూపొందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఉగ్రవాది’పై చేయిచేసుకున్న సామాన్యుడు.. చివరకు ట్విస్ట్ అదిరింది..!

ప్రాణాలు లెక్కచేయకుండా ‘టెర్రరిస్టు’కు ఎదురెళ్లిన సామాన్యుడి తెగువ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడి ధైర్యసాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అయితే.. ఆ తర్వాత ట్విస్ట్‌ తెలుసుకొని, నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? మహారాష్ట్ర(Maharashtra)లోని ధూలే (Dhule)ప్రాంతంలోని రద్దీగా ఉన్న ఓ ఆలయ ప్రాంగణంలోకి కొందరు దుండగులు దూసుకొచ్చారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారు. అలాగే ఆలయం వద్ద ఓ భక్తుడి తలపై గన్నుపెట్టి బెదిరింపులకు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని