రూ.45,000 జీతంతో రిటైర్మెంట్‌.. అక్రమంగా పోగేసింది రూ.10 కోట్లు..!

జిల్లా వైద్యశాలలో స్టోర్‌ కీపర్‌గా పనిచేసి రిటైరైన ఓ ఉద్యోగి ఏకంగా రూ. 10 కోట్ల మేరకు ఆస్తులను కూడబెట్టినట్లు లోకాయుక్త అధికారులు గుర్తించారు.

Published : 09 Aug 2023 10:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో రూ.45,000 జీతంతో స్టోర్‌ కీపర్‌గా రిటైరైన ఓ వ్యక్తి.. దాదాపు రూ.10 కోట్లు అక్రమంగా పోగేసినట్లు లోకాయుక్త అధికారుల తనిఖీల్లో తేలింది. రాష్ట్రంలోని ఆరోగ్యశాఖలో అష్ఫాక్‌ అలీ స్టోర్‌ కీపర్‌గా రిటైరయ్యారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు లోకాయుక్తకు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టింది. భోపాల్‌లోని అలీ ఇంటిపై నిర్వహించిన దాడుల్లో రూ.46 లక్షల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు దొరికాయి.

ఒంటరి మహిళ ఖాతాలో రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీరు

ఈ ఇంట్లో లక్షల రూపాయల విలువైన మాడ్యూలర్‌ కిచెన్‌, షాండ్లియర్లు, ఖరీదైన సోపాలు, రిఫ్రిజిరేటర్‌, టెలివిజన్‌ వంటివి ఉన్నాయి. దీంతోపాటు లోకాయుక్త అధికారులు వివిధ ప్రదేశాల్లో అలీకి స్థిరాస్తులున్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనావేశారు. కేవలం అలీ పేరిటే ఉన్న 16 స్థిరాస్తి పత్రాలను గుర్తించారు. వీటివిలువ రూ. 1.25 కోట్లకుపైగా ఉంటోంది.

ఇక భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న ఆస్తులు దీనికి అదనం.  వీటితోపాటు నాలుగు భవనాలు, 14,000 చదరపుటడుగుల్లో నిర్మిస్తున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ను గుర్తించారు. రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆస్పత్రిలో అష్ఫాక్‌ స్టోర్‌ కీపర్‌గా పనిచేశాడు. అలీ మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు