మీరు కూర్చోండి.. లేకపోతే..!: సహచర ఎంపీపై సహనం కోల్పోయిన కేంద్రమంత్రి

సహచర ఎంపీని ఉద్దేశించి కేందమంత్రి నారాయణ రాణె(Narayan Rane) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో భాజపా ఆయన్ను సభనుంచి సస్పెండ్ చేస్తుందా..? అని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. 

Updated : 09 Aug 2023 10:40 IST

దిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభలో కేంద్రమంత్రి నారాయణ రాణె(Narayan Rane) వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మంగళవారం శివసేన(యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌(Arvind Sawant)ను ఉద్దేశించి మాట్లాడుతూ సహనం కోల్పోయారు. దీంతో ఆయన ప్రవర్తనను విపక్ష పార్టీలు తప్పుపట్టాయి. 

ప్రధానిమంత్రిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సావంత్‌కు లేదంటూ దిగువ సభలో నారయణ రాణె(Narayan Rane) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సావంత్‌.. మీరు కూర్చోండి. ప్రధాన మంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాపై వ్యాఖ్యలు చేసే స్థాయి మీకు లేదు. ఒకవేళ మీరు మాట్లాడితే.. దాని పరిణామాలు ఎదుర్కొంటారు’ అని హెచ్చరికలు చేశారు. దాంతో లోక్‌సభ స్పీకర్‌ ఆయన్ను మందలించాల్సి వచ్చింది. సరైన పదజాలం వాడండి అంటూ సూచించారు. రాణె ప్రవర్తనపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

ఏమవుతుంది...అవిశ్వాసం?

‘ఒక రౌడీలా ఆయన పార్లమెంట్‌లో బెదిరింపులకు దిగారు. మోదీ(Modi) ప్రభుత్వాన్ని ప్రశ్నించే విపక్ష సభ్యులను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇలాంటి అనుచిత భాష ఉపయోగించిన భాజపా మంత్రిని సస్పెండ్ చేస్తారా..?’ అని ఆమ్‌ఆద్మీపార్టీ ప్రశ్నించింది. మంత్రి తన మాటలతో ఈ ప్రభుత్వ ప్రమాణాలను చూపిస్తున్నారంటూ శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు