ఈగల బెడద తట్టుకోలేక.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన గ్రామస్థులు

తమ గ్రామంలో తీవ్ర సమస్యగా మారిన ఈగల బెడదను తట్టుకోలేక పలువురు.. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన చేపట్టారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

Published : 09 Aug 2023 12:08 IST

లఖ్‌నవూ: కుటుంబ కలహాలతో లేదా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం పలువురు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి బెదిరించిన ఘటనలు ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో (social media) తరచుగా చూస్తున్నాం. కానీ.. ఓ గ్రామంలో తీవ్ర సమస్యగా మారిన ఈగల (flies) బెడదను తట్టుకోలేక పలువురు స్థానికులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన చేపట్టారు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌ జిల్లాలోని కుయ్య గ్రామంలో గత కొంత కాలంగా ఈగల సమస్య తీవ్రంగా ఉంది. దీనికి వారి గ్రామంలో ఉన్న పౌల్ట్రి ఫామే కారణం. ఈ కారణంగా ఈగల బెడద పెరిగి.. గ్రామస్థుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈగలు ఎక్కువగా ఉండటంతో నిరంతరం దోమ తెరల కింద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో గ్రామంలో పెళ్లిళ్లు కూడా జరగడం లేదు. అంతే కాకుండా కొంతమంది మహిళలు గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. బంధువుల రాకపోకలు లేవు. గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యకం చేస్తున్నారు. ఈ క్రమంతో తమ నిరసనను తెలియజేసేందుకు ఏడుగురు గ్రామస్థులు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చారు. గంటల తరబడి చర్చించిన తర్వాత వారు కిందకు దిగడంతో అందరూఊపిరి పీల్చుకున్నారు. త్వరలోనే ఈగల సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని