Nara Lokesh: లైఫ్‌లైన్‌ ప్రాజెక్టుకు లైఫే లేకుండా చేశారు: నారా లోకేశ్‌ ట్వీట్‌

బ్రిటిష్‌ పాలన కంటే ఘోరమైన పాలన ఏపీలో సాగుతోందని నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.‘‘భారతదేశ స్వాతంత్ర్య సమర నినాదం క్విట్‌ ఇండియా. 1942 ఇదే రోజున క్విట్‌ ఇండియా అని ననదిస్తే బ్రిటిష్‌ వాళ్లు ప్రజలను జైళ్లలో పెట్టేవారు.

Updated : 09 Aug 2023 14:00 IST

అమరావతి: బ్రిటిష్‌ పాలన కంటే ఘోరమైన పాలన ఏపీలో సాగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సంందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు.‘‘భారతదేశ స్వాతంత్ర్య సమర నినాదం క్విట్‌ ఇండియా. 1942 ఇదే రోజున క్విట్‌ ఇండియా అని నినదిస్తే బ్రిటిష్‌ వాళ్లు ప్రజలను జైళ్లలో పెట్టేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో బ్రిటిష్‌ వాళ్లకు మించిన పాలన జరుగుతోంది. ఇప్పుడు మన జన నినాదం ‘క్విట్‌ సైకో జగన్‌ - సేవ్‌ ఏపీ’’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. 

మరోవైపు రాష్ట్రానికి లైఫ్‌లైన్‌ ప్రాజెక్ట్‌ అయిన పోలవరానికి సీఎం జగన్‌ లైఫే లేకుండా చేశారని లోకేశ్‌ విమర్శించారు. జగన్‌ పాలనలో పాత ప్రాజెక్టుల విధ్వంసం తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం తీరుతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు. నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రశ్నార్థకమైందని లోకేశ్‌ దుయ్యబట్టారు.

సత్తెనపల్లిలో ‘యువగళం’ పాదయాత్ర

మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది. మార్గంమధ్యలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు ముఖ్యనేతలు లోకేశ్‌ వెంట నడుస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని