Defence Ministry: సైబర్‌ దాడులు తట్టుకొనేందుకు రంగంలోకి ‘మాయ’.. రక్షణ శాఖ నిర్ణయం

రక్షణశాఖ కీలక కంప్యూటర్‌ వ్యవస్థల్లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఓఎస్‌ను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఆగస్టు 15 లోపు ఈ పని పూర్తి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Updated : 09 Aug 2023 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లోని రక్షణశాఖ (Defence Ministry) వెబ్‌సైట్లు, కంప్యూటర్లపై సైబర్‌ దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఇంటర్నెట్‌తో కనెక్ట్‌ అయిన తమ శాఖలోని కంప్యూటర్లలో మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను.. దేశీయంగా అభివృద్ధి చేసిన ‘మాయ’ ఓఎస్‌తో భర్తీ చేయనుంది. ‘మాయ’ను ఓపెన్‌ సోర్స్‌ ఉబంటు ఆధారంగా రూపొందించారు.

మీరు కూర్చోండి.. లేకపోతే..!: సహచర ఎంపీపై సహనం కోల్పోయిన కేంద్రమంత్రి

‘‘మాయ ఇంటర్‌ఫేస్‌, పనితీరు పూర్తిగా విండోస్‌ను పోలి ఉంటుంది. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌లోకి మారినా.. పెద్దగా సమస్యలేమీ ఉండవు. ఆగస్టు 15 నాటికి సౌత్‌ బ్లాక్‌లో ఇంటర్నెట్‌ అనుసంధానం ఉన్న కంప్యూటర్లలో దీనిని ఇన్‌స్టాల్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ అధికారి పేర్కొన్నారు. దీంతోపాటు ఎండ్‌పాయింట్‌ డిటెక్షన్‌, ప్రొటెక్షన్‌ వ్యవస్థ ‘చక్ర వ్యూహ్‌’ను కూడా ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం రక్షణశాఖలో ఇంటర్నెట్‌, త్రివిధ దళాల నెట్‌వర్క్‌తో అనుసంధానించని కంప్యూటర్లలో మాత్రమే మాయ ఓఎస్‌ను వాడుతున్నారు. త్వరలోనే త్రివిధ దళాలకు చెందిన నెట్‌వర్క్‌ వ్యవస్థల్లో ఈ ఓఎస్‌ను వినియోగించే అవకాశం ఉంది. ఇప్పటికే నౌకాదళం దీనికి సంబంధించిన అనుమతులు మంజూరు చేసింది. సైన్యం, వాయుసేన మాత్రం మాయ పనితీరును అంచనావేస్తున్నాయి.

మాయా ఓఎస్‌ను ప్రభుత్వ రంగ ఏజెన్సీలు ఆరునెలల వ్యవధిలో అభివృద్ధి చేశాయి. ఈ ఓఎస్‌ మాల్‌వేర్‌ సహా పలురకాల సైబర్‌ దాడులను కట్టడి చేస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కీలక వ్యవస్థలపై పలు మార్లు మాల్‌వేర్, రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగాయి. దీంతో మైక్రోసాఫ్ట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఓఎస్‌తో మార్చాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని