‘ఉగ్రవాది’పై చేయిచేసుకున్న సామాన్యుడు.. చివరకు ట్విస్ట్ అదిరింది..!

Maharashtra: ఆలయంలోకి ఒక్కసారిగా ముసుగు వ్యక్తులు దూసుకురావడంతో ప్రజలంతా వణికిపోయారు. వారి ఆందోళన చూసి ఓ వ్యక్తి ప్రాణాలు లెక్కచేయకుండా వారికి ఎదురెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Published : 09 Aug 2023 11:33 IST

ధూలె: ప్రాణాలు లెక్కచేయకుండా ‘టెర్రరిస్టు’కు ఎదురెళ్లిన సామాన్యుడి తెగువ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అతడి ధైర్యసాహసాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అయితే.. ఆ తర్వాత ట్విస్ట్‌ తెలుసుకొని, నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

మహారాష్ట్ర(Maharashtra)లోని ధూలే (Dhule)ప్రాంతంలోని రద్దీగా ఉన్న ఓ ఆలయ ప్రాంగణంలోకి కొందరు దుండగులు దూసుకొచ్చారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారు. అలాగే ఆలయం వద్ద ఓ భక్తుడి తలపై గన్నుపెట్టి బెదిరింపులకు దిగారు. ఈ ఆకస్మిక చర్యతో గుడికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరు పిల్లలు ఏడుపు మొహం పెట్టేశారు. ఈ పరిస్థితితో ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి ధైర్యంగా ముందుకెళ్లాడు. గన్‌ పెట్టి బెదిరిస్తోన్న దుండగుడిపైకి దూసుకెళ్లాడు. మీకసలు బుద్ధుందా..? అంటూ వారి మీద కేకలు వేయడమే కాకుండా.. చెంప పగలగొట్టాడు. 

మహారాష్ట్రలో దొంగల భయంతో టమాటా తోటకు సీసీ కెమెరాలు

అయితే.. అప్పటికే ధూలే(Dhule) ప్రాంతంలోని శ్రీ స్వామి నారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం వచ్చింది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ తర్వాత అసలు విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. అప్పటికే తుపాకీ శబ్దాలకు వణిపోయిన వారు ఇదంతా పోలీసులు నిర్వహించిన మాక్‌ డ్రిల్‌లో భాగమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. టెర్రరిస్టుపైకి దూసుకెళ్లిన ఆ వ్యక్తి పేరు ప్రశాంత్‌ కులకర్ణి అని వెల్లడించారు. తన కుమార్తె ఏడ్వడం వల్లే ఆయన అంత ధైర్యం చేసినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని