Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Aug 2023 13:14 IST

1. గ్రూపు -2ను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు: ప్రొ.కోదండరామ్‌

రాష్ట్రంలో ఈ నెలాఖరున జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నేడు గన్‌ పార్క్ వద్ద మౌనదీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram)ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరామ్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు ఓయూ విద్యార్థులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. దిల్లీ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం.. ఇక చట్టంగా..

అత్యంత వివాదాస్పదమైన ‘దిల్లీ సర్వీసుల బిల్లు’ (జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లు-2023) ఇక చట్టంగా మారింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుపై ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా ఆమోదముద్ర వేశారు. దీంతో ఇక దిల్లీ సర్వీసుల చట్టం (Delhi Services Act)గా అమల్లోకి వచ్చింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎటు చూసినా కాలిన శవాలే.. బూడిదైన హవాయి స్వర్గధామం

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక నగరం ఇప్పుడు బూడిద దిబ్బగా మారింది. ఇల్లూ-వాకిలి, చెట్టూచేమ, గొడ్డూగోదా సర్వం మాడిమసైపోయాయి. ఎటూ చూసిన కాలిన మృతదేహాలు.. దగ్ధమైపోయిన భవనాలతో హృదయ విదారక దృశ్యాలే కన్పిస్తున్నాయి. అమెరికాలో హవాయి (Hawaii) దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా (Lahaina) రిసార్టు నగరంలో కార్చిచ్చు (WildFire) మిగిల్చిన పెను విషాదమిది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరో కొత్త ఫీచర్‌.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే లాక్‌చాట్‌, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఒకే వాట్సాప్‌ యాప్‌లో వేర్వేరు ఖాతాలను ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సూర్యపై నమ్మకముంది.. పాండ్య ధోనీ కానక్కర్లేదు.. భారత్‌పై ఒత్తిడి ఎక్కువే!

వెస్డిండీస్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో (WI vs IND) కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) భారత్‌ను గెలిపించాడు. నేడు విండీస్‌తో నాలుగో మ్యాచ్‌ కోసం భారత్‌ సిద్ధమవుతోంది. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య వన్డేల్లో మాత్రం గొప్ప ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. దీంతో వచ్చే వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) జట్టులో స్థానం దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెద్ద నేరాల్లో ప్రముఖులుంటే.. కేసులు అంగుళం కదలవు: జస్టిస్‌ బట్టు దేవానంద్‌

దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోందని మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ అన్నారు. గుంటూరులో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి

తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటారనగా.. ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సీఎంవోలో డిజిటల్‌ సంతకాల దుర్వినియోగం.. ఐదుగురి అరెస్టు

ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్‌ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు. నిందితులు కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్‌’లు జారీ చేసినట్లు తెలిపారు. సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వీరు సంతకాలను దుర్వినియోగం చేశారన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చంపేసి, నదిలో విసిరేసి: భాజపా మహిళా నేత మిస్సింగ్ కేసులో భర్త అరెస్టు

పది రోజులుగా కనిపించకుండాపోయిన నాగ్‌పుర్‌కు చెందిన భాజపా నేత( Nagpur BJP leader) సనాఖాన్(Sana Khan) కేసులో పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేశారు. సనాను ఆమె భర్తే హత్య చేశాడని వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన సనాఖాన్‌.. భాజపా మైనార్టీ సెల్‌ సభ్యురాలు. ఆమె ఆగస్టు ఒకటిన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌(Jabalpur)కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తితిదే మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే.. ఆ ఘోరం తప్పేది: చంద్రబాబు

తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. కళ్ల ముందే కుమార్తెను క్రూర జంతువు లాక్కెళ్తే ఆ బాధ వర్ణనాతీతమని తెలిపారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు