Kodandaram: గ్రూపు -2ను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు: ప్రొ.కోదండరామ్‌

తెలంగాణ జన సమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram)ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

Updated : 12 Aug 2023 13:24 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ నెలాఖరున జరగాల్సిన గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ నేడు గన్‌ పార్క్ వద్ద మౌనదీక్షకు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ జన సమితి (తెజస)(TJS) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్ (Professor Kodandaram)ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. కోదండరామ్‌ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పలువురు ఓయూ విద్యార్థులను సైతం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

Aadhaar: మీ ఆధార్‌ నంబర్‌తో ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా?

ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ తప్పిదాలను నిరుద్యోగుల మీద నెట్టడం సరైంది కాదన్నారు. ‘‘ఒకేసారి 3 రకాల పోటీ పరీక్షలు ఉండటం వల్ల అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. నెల రోజుల పాటు గ్రూపు -2 పరీక్షను వాయిదా వేస్తే నష్టమేమీ లేదు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు’’ అని ఆక్షేపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని