Chandrababu: తితిదే మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే.. ఆ ఘోరం తప్పేది: చంద్రబాబు

తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు.

Published : 12 Aug 2023 12:04 IST

తిరుమల: తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందడంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అలిపిరి కాలినడక మార్గంలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. కళ్ల ముందే కుమార్తెను క్రూర జంతువు లాక్కెళ్తే ఆ బాధ వర్ణనాతీతమని తెలిపారు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు సైతం గాయపడ్డాడని చంద్రబాబు గుర్తుచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేదన్నారు.

అదనపు భద్రత ఏర్పాటు చేయవచ్చు కదా?: భానుప్రకాశ్‌రెడ్డి 

బాలికపై చిరుత దాడి చాలా దురదృష్టకర ఘటన అని భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు. బాలిక మృతికి భద్రతా వైఫల్యమే కారణమన్నారు. ‘‘ జంతువులు దాడి చేసే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కదా? అదనపు భద్రత ఏర్పాటు చేయవచ్చు కదా?’’ అని ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు