AP News: సీఎంవోలో డిజిటల్‌ సంతకాల దుర్వినియోగం.. ఐదుగురి అరెస్టు

ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్‌ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.

Updated : 12 Aug 2023 12:42 IST

అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో డిజిటల్‌ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు. నిందితులు కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్‌’లు జారీ చేసినట్లు తెలిపారు. సీఎంవోలోని రేవు ముత్యాల రాజు, ధనుంజయ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి పేషీల్లో పని చేస్తున్న వీరు సంతకాలను దుర్వినియోగం చేశారన్నారు.

ఒక్కో ఫైల్‌కు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారన్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలల్లో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం రూ.15 లక్షల వరకూ వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. అయితే, ఏ దస్త్రానికి తుది ఆమోదం రాలేదని వెల్లడించారు. ‘‘డాక్టర్లు, టీచర్‌ల బదిలీకి సంబంధించిన దస్త్రాలను సీఎంపీలు జారీ చేశారు. సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సంతకాల టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సంతకం దొంగిలించి సీఎంపీలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నాం’’ అని  ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని