Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి

తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు.

Updated : 12 Aug 2023 11:41 IST

తిరుమల: తిరుమల కొండపై తీవ్ర విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిన్నారి లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఇంకో గంట సమయం ప్రయాణిస్తే తిరుమలకు చేరుకుంటారనగా.. ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. కుటుంబసభ్యులు భయంతో కేకలు వేయడంతో అడవిలోకి ఈడ్చుకెళ్లింది.

CM Jagan: ‘నువ్వు తిరుగు.. లేదంటే నీ కొడుకును తిప్పు’

దీంతో పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలు పడలేదు. ఇవాళ ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. తొలుత ఎలుగు బంటి దాడిలోనే బాలిక మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే, చిరుత దాడిలోనే చిన్నారి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు నిర్ధరించారు. అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని బాధితుల స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలేనికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, గతంలోనూ కాలినడక మార్గంలో బాలుడిపై చిరుత దాడి చేసిన సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని