Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Aug 2023 13:05 IST

1. ట్రోల్స్‌పై స్పందించిన తితిదే ఛైర్మన్‌

తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను ఛైర్మన్‌ భూమన ఖండించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు

మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించ వద్దన్న కోర్టు ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా వేధింపులకు దిగుతోంది. గురువారం రాష్ట్రంలోని వివిధ మార్గదర్శి బ్రాంచీల్లో సోదాల పేరుతో ఇబ్బందులు సృష్టిస్తోంది. ఏపీ సీఐడీ అధికారులతో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీల పేరుతో మార్గదర్శి కార్యకలాపాలకు అడ్డంకులు కలిగిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. నందిగామలో టాయిలెట్‌ల పక్కన మహనీయుల విగ్రహాలు

ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు తొలగించారు. సెంటర్‌లో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, అబ్దుల్‌కలాం, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌, గుర్రం జాషువా, దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు తదితర నేతల విగ్రహాలు ఉన్నాయి. తొలగించిన విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్‌ల పక్కన పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దు : బొమ్మై

కర్ణాటకలో అమలు చేస్తున్న నూతన విద్యావిధానాన్ని (NEP) వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తానని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai)ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హాట్‌ చాక్లెట్‌తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన

విమాన ప్రయాణంలో వేడి పానీయం(hot beverage) చిందడంతో ఓ చిన్నారి గాయపడింది. ఈ విషయంలో విస్తారా(Vistara) సంస్థ వ్యవహరించిన తీరుపై ఆ చిన్నారి తల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై ఆ సంస్థ స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? ఇటీవల రచనా గుప్తా అనే మహిళ తన కుమార్తెతో కలిసి దిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌( Delhi to Frankfurt) వెళ్లే విస్తారా విమానం ఎక్కారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. నడిసంద్రంలో చైనీయుడికి కార్డియాక్‌ అరెస్ట్‌.. చిమ్మచీకట్లో భారత్‌ సాహసోపేత ఆపరేషన్‌

నడి సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ చైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కార్డియాక్‌ అరెస్ట్‌ (cardiac arrest)కు గురవడంతో అతడిని కాపాడేందుకు భారత కోస్ట్‌గార్డ్‌ (Indian Coast Guard) ప్రతికూల వాతావరణంలో సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టింది. చిమ్మచీకట్లో అతడిని ఎయిర్‌లిఫ్ట్‌ చేసి ఆసుపత్రికి తరలించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. విమానం గాల్లో ఉండగా.. బాత్రూమ్‌లో కుప్పకూలిన పైలట్‌

అమెరికా (USA)లోని మియామి నుంచి చిలీ (Miami - Chile flight) బయల్దేరిన ఓ కమర్షియల్‌ విమానంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విమానం ప్రయాణిస్తుండగా పైలట్‌ (Pilot) హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన కో-పైలట్లు (Co-Pilot) విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఐస్‌క్రీమ్‌ ప్రదేశాల గురించి నన్ను అడగండి..: బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు ఐస్‌క్రీమ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన హిమక్రీముపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టుకొన్నారు. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (IRA) తొలి వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘నేను పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఎయిర్‌పోర్టులోకి వరద.. మోకాలిలోతు నీటిలో విమానాలు

జర్మనీ (Germany)లో ఫ్రాంక్‌ఫర్ట్‌ (Frankfurt) నగరం భారీ వర్షాల (Heavy Rains)తో అతలకుతలమైంది. పలు చోట్ల రహదారులు నదులను తలపిస్తున్నాయి. ఒక గంటలోనే దాదాపు 25 వేలసార్లు మెరుపులు వచ్చాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం (Frankfurt airport) పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని