Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు

మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించవద్దన్న కోర్టు ఉత్తర్వులను సైతం అమలు చేయకుండా వేధింపులకు దిగుతోంది.

Updated : 17 Aug 2023 15:10 IST

అమరావతి: మార్గదర్శి (Margadarsi)పై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (AP Govt) మరోమారు కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించవద్దన్న కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి వేధింపులకు దిగుతోంది. గురువారం రాష్ట్రంలోని వివిధ మార్గదర్శి బ్రాంచీల్లో సోదాల పేరుతో ఇబ్బందులు సృష్టిస్తోంది. ఏపీ సీఐడీ (AP CID) అధికారులతో పాటు రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్, విజిలెన్స్ అధికారులు తనిఖీల పేరుతో మార్గదర్శి కార్యకలాపాలకు అడ్డంకులు కలిగిస్తున్నారు. కొన్ని బ్రాంచీల్లో గేట్లు, షట్టర్లు మూసివేసి ఖాతాదారులకు అవరోధాలు కల్పిస్తున్నారు.

పనివేళల్లో సిబ్బందికి, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని, వ్యాపార లావాదేవీలకు ఆటంకం కల్పించరాదంటూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. మార్గదర్శి బ్రాంచీల్లో ప్రవేశించిన అధికారులు నిరంతరం పైఅధికారులతో మాట్లాడుతూ వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. లోపల ఉన్న సిబ్బందిని బయటకు అనుమతించకుండా నిరోధిస్తున్నారు. బయటవారు ఎవరినీ లోనికి అనుమతించట్లేదు. దృశ్యాలు చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై బెదిరింపులకు దిగి వారిని అడ్డుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని